Site icon HashtagU Telugu

Andhra Pradesh : పార్వతీపురం రైల్వే స్టేషన్‌లోకి వ‌చ్చిన ఏనుగు.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌యాణికులు

Elephant

Elephant

పార్వతీపురం రైల్వే స్టేషన్‌లోకి అడవుల్లోంచి వచ్చిన ఓ ఏనుగు హాల్చ‌ల్ చేసింది. తెల్లవారుజామున రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా ఉన్న మ‌గ ఏనుగును చూసిన గ్రామస్థులు తమ మొబైల్ ఫోన్‌లలో ఏనుగు ఫొటోలు, వీడియోలు తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ‌గ ఏనుగు మంద నుంచి త‌ప్పిపోయి వ‌చ్చిన‌ట్లు అధికారులు గ్రామ‌స్తుల‌ను అలెర్ట్ చేశారు. బాసంగి మండలం జియ్యమ్మవలస, కొమరాడ మండలం వెంకటరాజు పురం, పాత నిమ్మలపాడు, పాత బిట్రపాడు, కల్లికోట, పాత దుగ్గి, పార్వతీపురం మండలం గుణానాపురం, పాత మార్కొండిపుట్టి, నవీరి, ఎర్రన్న గుడిలోని కొత్తలనాస రామినగుడి, ఎర్రన్న గుడి తదితర గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఫారెస్ట్ అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. ఈ గ్రామాల్లో రాత్రి, తెల్లవారుజామున సంచరించవద్దని అధికారులు సూచించారు. మన్యం డీఎఫ్‌ఓ ప్రసూన మాట్లాడుతూ.. అటవీశాఖ పర్యవేక్షణ పెంచామ‌ని తెలిపారు. మరికొంత మంది సిబ్బంది నైట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాత్రి వేళల్లో మగ ఏనుగు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర సంచరిస్తోందని, గ్రామాలకు నష్టం కలిగించే విధంగా మగ ఏనుగు ప్రవర్తించడం లేదని తెలిపారు.

Also Read:  Onion Price In Delhi: ప్రజల కంట కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.. ఢిల్లీలో 80 రూపాయలకు చేరిన ఉల్లి..!