AP Trains : విద్యుత్ తీగలు తెగడంతో.. ట్రైన్స్ రాకపోకలకు స్వల్ప అంతరాయం

AP Trains : శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడం రైల్వే స్టేషన్‌ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి.

  • Written By:
  • Updated On - September 19, 2023 / 06:58 AM IST

AP Trains : శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడం రైల్వే స్టేషన్‌ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సి.సిగడం సమీపంలో పలాస – విశాఖ ప్యాసింజర్‌ రైలు కొన్నిగంటల పాటు నిలిచిపోయింది. దీంతో రైలు ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రైల్వే సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపట్టడంతో మళ్లీ రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.

Also read : Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం.. నేడు సభ ముందుకు బిల్లు..!

ఇక  విజయవాడ సెక్షన్‌లో భద్రతాపరమైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారిమళ్లించారు. ఈనెల 18 నుంచి 24 వరకు కాకినాడ-విశాఖపట్నం-కాకినాడ పాసింజర్‌ (17267/17268), రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి ప్రత్యేక పాసింజర్‌ (07466/07467), గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239), గుంటూరు-రాయగడ (17243), మచిలీపట్నం-విశాఖ (17219) రైళ్లు క్యాన్సల్ అయ్యాయి.  ఈనెల 19 నుంచి 25 వరకు విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240), రాయగడ-గుంటూరు (17244), విశాఖ-మచిలీపట్నం (17220) రద్దు చేశారు. అలాగే ఈనెల 18, 19, 20, 22, 23 తేదీల్లో విశాఖ-విజయవాడ-విశాఖ మధ్య నడిచే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల (22701, 22702 )ను కూడా క్యాన్సల్ చేశారు.