Site icon HashtagU Telugu

Electricity Employees : విద్యుత్ ఉద్యోగ నేత‌ల‌పై ఆప‌రేష‌న్ `చిచ్చు`?

Ap Electricity Employees

Ap Electricity Employees

ఏపీ చీక‌ట్లోకి( Electricity Employees)వెళ్ల‌నుంది. ఒక వేళ ప్ర‌భుత్వం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు జ‌రిపే చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం కాక‌పోతే పూర్తిగా అంధ‌కారం కానుంది. విద్యుత్ ఉద్యోగులు నిర‌వ‌ధిక స‌మ్మె బాట ప‌ట్టారు. వాళ్ల వ‌ద్ద నున్న సిమ్ కార్డుల‌ను ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. దీంతో చివ‌రి నిమిషంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అప్ర‌మ‌త్తం అయింది. జేఏసీ నేత‌ల‌తో చ‌ర్చ‌ల‌కు పిలిచారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు. జేఏసీ నేత చంద్ర‌శేఖ‌ర్ ఇత‌ర నేత‌లు చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు. ఆ చ‌ర్చ‌ల ఆధారంగా ఏపీలోని విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆధార‌ప‌డి ఉంది.

చ‌ర్చ‌ల ఆధారంగా ఏపీలోని విద్యుత్ స‌ర‌ఫ‌రా ( Electricity Employees)

గ‌త నెల 21వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు ( Electricity Employees) ప‌లు డిమాండ్ల‌తో ఆందోళ‌న బాట ప‌ట్టారు. వాళ్ల ఆందోళ‌న చివ‌రి ద‌శ‌కు చేరింది. ఇక నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగాల‌ని నిర్ణ‌యించారు. ఈ అర్థ‌రాత్రి నుంచి స‌మ్మెకు దిగాల‌ని సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మాత్రం ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం ఇప్పుడు అప్ర‌మ‌త్తం అయింది. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుందా? లేదా ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల మ‌ధ్య చిచ్చు పెట్టిన చందంగా చేస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అర్థ‌రాత్రి నుంచి స‌మ్మెకు దిగాల‌ని

వేతన సవరణ సహా 12 డిమాండ్లతో ఉద్యోగులు గత కొంత కాలంగా నిరసనలకు చేస్తున్నారు. సర్కిల్, జోనల్, విద్యుదుత్పత్తి కేంద్రాలు, డిస్కమ్‌లు, జెన్కో, ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయాల్లో భోజన విరామ సమయాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నిరసన ప్రదర్శనల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా చేరారు. 1999లో వేతన సవరణ సహా ఇతర డిమాండ్ల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు చేశారు. మళ్లీ 24 ఏళ్ల తర్వాత సమ్మెకు( Electricity Employees) సిద్ధమవుతున్నారు.

విద్యుత్ ఉద్యోగ సంఘాల నేత‌ల్లోనూ చిచ్చు`

ప్ర‌భుత్వ ఉద్యోగులు, టీచ‌ర్లు కూడా ఇలాగే దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఆయా సంఘాల నేత‌ల‌తో విడ‌త‌వారీగా చ‌ర్చ‌లు జ‌రిపారు. మంత్రి వ‌ర్గ ఉప సంఘం వేయ‌డం ద్వారా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు. దీంతో తాత్కాలికంగా ఉద్యోగులు స‌ద్దుమ‌ణిగారు. ఆ త‌రువాత ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నేత‌ల‌తో రాజ‌కీయం మొద‌లు పెట్టారు. ఆయా సంఘాల నేత‌ల మ‌ధ్య చిచ్చు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తూ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణ మీద కేసు పెట్టి, అరెస్ట్ దిశ‌గా ప్ర‌భుత్వం తీసుకెళ్లింది. ఆ ఎపిసోడ్ లో చ‌ల్లా శ్రీనివాస‌రావు, బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు ల‌బ్ది పొందార‌ని ఉద్యోగులు కొంద‌రు ఇప్ప‌టికే ఆగ్ర‌హిస్తున్నారు. సీపీఎస్ ర‌ద్దు లేద‌ని చెప్పిన‌ప్ప‌టికీ పోరాడేందుకు ముందుకొచ్చే నేత‌లు లేకుండా పోయారు. స‌రిగ్గా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు విద్యుత్ ఉద్యోగ సంఘాల నేత‌ల్లోనూ( Electricity Employees) తీసుకొచ్చే ప్ర‌య‌త్నం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేస్తుంద‌ని టాక్‌.

Also Read : Employees Fight : వై నాట్ CPS దిశ‌గా ఉద్యోగుల ఉద్య‌మ‌బాట‌

ప‌ర్స‌న‌ల్ పే విష‌యంలో విద్యుత్ రంగం సంస్థ‌ల యాజ‌మాన్యంకు, ఉద్యోగుల‌కు మ‌ధ్య ఏకాభిప్రాయం రావ‌డంలేదు. ఆ విష‌యంలో ఇరుప‌క్షాలు ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌మ్మెకు దిగిన విద్యుత్ ఉద్యోగుల‌ను ఎలా జ‌గ‌న్ స‌ర్కార్ హ్యాండిల్ చేస్తుంది? అనేది సందిగ్ధం. సేమ్ టూ సేమ్ ప్ర‌భుత్వ ఉద్యోగులు, టీచ‌ర్ల సంఘాల నేత‌ల‌ను మేనేజ్ చేసిన‌ట్టు విద్యుత్ ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను కూడా మేనేజ్ చేయ‌డానికి అవకాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. లేదంటే, ఈ అర్థ‌రాత్రి నుంచి ఏపీ ఆంధ‌కారంలోకి వెళ్ల‌నుంది.

Also Read : AP employees : ఉద్యోగ సంఘాల్లో భారీ చీలిక‌, సూర్య‌నారాయ‌ణపై పోలీస్ వేట‌