పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ రెట్టింపు: గ్రిడ్ విస్తరణపై నిపుణుల హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్ తన ఇంధన రంగంలో ఒక పెను మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన వనరుల లభ్యత ప్రణాళిక (2024-25 నుండి 2034-35) ప్రకారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2024-25లో 14,610 మెగావాట్ల నుండి 2034-35 నాటికి భారీగా 28,850 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Electricity demand in Andhra Pradesh to double in ten years: Experts warn against grid expansion

Electricity demand in Andhra Pradesh to double in ten years: Experts warn against grid expansion

Vijayawada: రోజురోజుకి విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఇందుకు ఏ రంగం మినహాయింపు కాదు. నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే పదేళ్లలో ఇప్పుడున్న దానికంటే రెట్టింపు వినియోగం ఉండబోతోంది. ఇంకా చెప్పాలంటే రాబోయే దశాబ్దంలో విద్యుత్ డిమాండ్ రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ తన ఇంధన రంగంలో ఒక పెను మార్పుకు సిద్ధమవుతోంది. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన వనరుల లభ్యత ప్రణాళిక (2024-25 నుండి 2034-35) ప్రకారం రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2024-25లో 14,610 మెగావాట్ల నుండి 2034-35 నాటికి భారీగా 28,850 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అధికారులు మరియు పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏటా సగటున దాదాపు 7% అదనపు విద్యుత్ కావాల్సి ఉంటుంది. ఇందుకు కారణం.. దూకుడుగా సాగుతున్న పారిశ్రామిక విస్తరణ పోర్టుల ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు, పెరుగుతున్న సాగునీటి అవసరాలు మరియు వేగవంతమైన పట్టణీకరణ కారణాలుగా భావిస్తున్నారు. ఇదే కాలంలో వార్షిక ఇంధన అవసరాలు కూడా సుమారు 81,025 మిలియన్ యూనిట్ల (ఎంయూ) నుండి 1,56,630 ఎంయూలకు పెరుగుతాయని నివేదిక నొక్కి చెప్పింది. రాష్ట్రం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయంగా పెంచడానికి ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఒక కీలకమైన అవరోధంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దక్షిణ భారతదేశం అంతటా బహుళ పునరుత్పాదక ప్రాజెక్టులలో పాల్గొన్న విద్యుత్ రంగ నిపుణుడు శ్రీ సద్దాఫ్ ఆలం ఈ సందర్భంగా మాట్లాడుతూ… “పవర్ ని మోసుకెళ్లే వైర్ల కంటే అత్యంత ఫాస్ట్ గా ఉన్న జనరేషన్ ఉన్న కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు కనుక మనం మేలుకొనకపోతే. రాష్ట్రం విద్యుత్తును ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ల నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసిన అవి మనకు కావాల్సిన విద్యుత్ సరఫరాని అందించలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోతాయి అని అన్నారు. పగటిపూట విద్యుత్ కు గరిష్ట డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సౌరశక్తి లేని సమయాలు దుర్బలంగా ఉన్నాయని గ్రిడ్ బ్యాలెన్సింగ్ మరియు పీక్ లోడ్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతుందని అధ్యయనం హైలైట్ చేస్తుంది. హెచ్చుతగ్గుల లోడ్లను నిర్వహించడానికి రద్దీని తగ్గించడానికి మరియు గ్రిడ్ స్థిరత్వాన్ని నిర్వహించడానికి ఇంట్రాస్టేట్ మరియు ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌ మిషన్ నెట్‌ వర్క్‌ లను బలోపేతం చేయడం చాలా అవసరం.

ట్రాన్స్ మిషన్ ఇప్పుడు విద్యుత్ విశ్వసనీయతకు వెన్నెముక. కొత్త లైన్లు మరియు సబ్‌ స్టేషన్లలో సకాలంలో ఏర్పాటు చేయకపోతే ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో ఉన్నప్పటికీ సరఫరా అడ్డంకులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని ఆయన అన్నారు. ప్రసార ప్రాజెక్టులలో జాప్యాలు పరిశ్రమలు, వ్యవసాయం మరియు పట్టణ వినియోగదారులను నేరుగా ప్రభావితం చేస్తాయి. రాష్ట్ర ట్రాన్స్ మిషన్ వ్యవస్తను మరింతగా బలోపేతం చేయడం కేవలం సాంకేతిక సవాలు మాత్రమే కాదు విధానపరమైన ఆవశ్యకత అని ఇంధన విశ్లేషకులు నొక్కిచెప్పారు. “ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయమైన 24/7 విద్యుత్తును కోరుకుంటే ముఖ్యంగా పునరుత్పాదక వనరుల నుండి గ్రిడ్ ఇప్పుడు ప్రాధాన్యతనివ్వాలి, ఎందుకంటే ట్రాన్స్ మిషన్ లైన్లను నిర్మించడానికి సంవత్సరాల సమన్వయ ప్రణాళిక భూమి ఆమోదాలు క్లియరెన్స్ అవసరం. ట్రాన్స్ మిషన్ లైన్లను సకాలంలో విస్తరించడం వలన తగినంత విద్యుత్ మరియు రాష్ట్రం యొక్క సమగ్ర వృద్ధిని నిర్ధారిస్తుంది” అని ఒక స్వతంత్ర విద్యుత్ వ్యవస్థ పరిశోధకుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అధిక విద్యుత్తు అవసరాల వైపు వేగంగా విస్తరించడం వల్ల క్లీన్-ఎనర్జీ వైపు దృష్టిసారించాలి. అలాంటప్పుడే వ్యవస్థపై మనం తక్కువగా ఆధారపడే పరిస్థితి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. . ఎందుకంటే అన్ని వ్యవస్థల్ని ఒకదానితో ఒకటి కట్టిపడేసేది తీగలు మాత్రమే.

  Last Updated: 19 Jan 2026, 09:05 PM IST