CM Jagan: ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా అవకాశం ఉందని మంత్రులతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, అయితే క్షేత్రస్థాయిలో మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు.
ఎన్నికల షెడ్యూల్‌ను గతంలో కంటే 20 రోజుల ముందుగానే విడుదల చేసే అవకాశం ఉందని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు, మీడియా సంస్థలు అసత్య ప్రచారాలను గట్టిగా ఎదుర్కోవాలని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ లోనే కేంద్రం ఎన్నికలు వెళ్లాలని చూసింది అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే రామమందిరం ప్రారంభం వంటి కార్యక్రమం ఉంది. జనవరి 22న ఆ కార్యక్రమం పూర్తి అవగానే బీజేపీ కూడా ఎన్నికల సన్నాహాల్లో పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సారి జగన్ కు ఇటు టీడీపీ నుంచి అటు, ఇటు బీజేపీ నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.
Also Read: HYD: హైదరాబాద్ లో దారుణం, స్కూల్ బస్సు ఢీకొని బాలుడు దుర్మరణం