Site icon HashtagU Telugu

Election Commission : ఏపీలో ఉద్రిక్తతలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు

Election Commission

Election Commission

Election Commission : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, సత్తెనపల్లి, మాచర్ల, తిరుపతి సహా  పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. దీనిపై వివరణ కోరుతూ డీజీపీ హరీశ్ కుమార్, సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమన్లు జారీ చేసింది. ఇద్దరూ వ్యక్తిగతంగా ఢిల్లీలో తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీ రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్‌లు విఫలమయ్యారని ఈసీ(Election Commission)  అభిప్రాయపడింది.

We’re now on WhatsApp. Click to Join

పులివర్తి నానిపై తిరుపతిలో దాడి

చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నానిపై మంగళవారం తిరుపతిలో దాడి జరిగింది.తిరుపతి పద్మావతి యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూం పరిశీలనకు వెళ్లి వస్తు్న్న పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆ దాడిని నిరసిస్తూ మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే నాని బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పులివర్తి నాని భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.కారు బ్యానెట్‌కు ఉన్న కెమెరాలో దాడి ఫుటేజీ అంతా రికార్డు అయింది. టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని వైసీపీ నేతలను తరిమికొట్టారు. అక్కడే ఉన్న వైసీపీ నేతల కారు, బైక్ ను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు.

Also Read : AP : గర్భిణి అని కూడా చూడకుండా దాడి చేసిన వైసీపీ రాక్షసులు – నారా లోకేష్

Also Read :AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం