Site icon HashtagU Telugu

Chandrababu : కాస్త మానవత్వం చూపండి జగన్ గారూ..! – చంద్రబాబు

Chandrababu Districts Tour

Chandrababu Districts Tour

అనంతపురం జిల్లాలో నక్కదొడ్డి తండాకు చెందిన సరోజమ్మ (40) అనే అంధురాలు..తన పింఛను ను అధికారులు తొలగించడం తో మనస్తాపం గురై.. ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ఘటన ఫై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘‘ కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ! మాటల్లో కాదు చేతల్లో… ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం. ఆమె ఆత్మహత్య అత్యంత హృదయవిదారకం’’ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఈఘటన ఫై స్పందిస్తూ..జగన్ ఫై విరుచుకపడ్డారు. సరోజ కళ్లు కనిపించవని, కళ్లుండీ ఆమె ప్రాణాలు రక్షించలేకపోయాని వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆమె తమ్ముడికి ఉద్యోగం వచ్చిందనే కారణం చూపి ఏడాదిగా పెన్షన్ నిలిపేశారని, తనకున్న ఏకైక ఆసరా కోల్పోయాననే బెంగతో సరోజ ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఇంకెంత మంది దివ్యాంగులు, వృద్ధులను బలి తీసుకుంటావు సైకో జగన్ అంటూ ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు.

Read Also : Dhiraj Sahu IT Raids : ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై రాహుల్ ఎందుకు మాట్లాడట్లేదు..? – కిషన్ రెడ్డి