RRR: ఢిల్లీలో త్రిబుల్ ఆర్ అన‌ర్హ‌త లొల్లి

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు మీద అన‌ర్హ‌త వేటు వ్య‌వ‌హారం ఒక అడుగు ముందుకు ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ లోక్ స‌భ స్పీక‌ర్ కు చేసిన ఫిర్యాదుపై స్పంద‌న కనిపిస్తోంది.

  • Written By:
  • Updated On - January 29, 2022 / 12:20 PM IST

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు మీద అన‌ర్హ‌త వేటు వ్య‌వ‌హారం ఒక అడుగు ముందుకు ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ లోక్ స‌భ స్పీక‌ర్ కు చేసిన ఫిర్యాదుపై స్పంద‌న కనిపిస్తోంది. ప్రాథ‌మిక ఆధారాల‌ను ప‌రిశీలించిన స్పీక‌ర్ లోక్ సభ రూల్స్,1985 లోని రూల్ 7(4) ప్రకారం విచార‌ణ జ‌ర‌పాల‌ని ప్రివిలేజ్ క‌మిటీకి ఆదేశాలు జారీ చేశాడు. పదవ షెడ్యూల్ తో పాటు, లోక్ సభ రూల్స్ లోని నెంబర్ 6 ప్రకారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌ర‌త్ అంద‌చేసిన పిటిష‌న్ ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాల‌ని ప్రివిలేజ్ క‌మిటీని స్పీక‌ర్ ఓంబిర్లా ఆదేశించాడు.
చాలా కాలంగా రెబ‌ల్ త్రిబుల్ ఆర్ కు సంబంధించిన అన‌ర్హ‌త వ్య‌వ‌హారం పెండింగ్ లోనే ఉంది. లోక్ స‌భ జ‌రిగిన ప్ర‌తిసారీ వైసీపీ ఎంపీలు ఆయ‌న్ను అన‌ర్హునిగా ప్ర‌క‌టించాల‌ని కోరిన సంద‌ర్భాలు అనేకం. కానీ, స్పీక‌ర్ ఓం బిర్లా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో ఒక‌టిన్న‌ర ఏడాదిగా త్రిబుల్ ఆర్‌, వైసీపీల మ‌ధ్య వార్ న‌డుస్తోంది.

ప్ర‌త్యేకించి మార్గాని భ‌ర‌త్ కు ఇటీవ‌ల త్రిబుల్ స‌వాల్ విసిరాడు. చేత‌నైతే అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని మార్గాని భ‌ర‌త్ అండ్ టీంకు త్రిబుల్ నేరుగా ఛాలెంజ్ చేశాడు. లేదంటే, తానే అన‌ర్హ‌త కోసం ప్ర‌య‌త్నం చేస్తాన‌ని త్రిబుల్ చేసిన స‌వాల్ వైసీపీని ఇరుకున ప‌డేసిన‌ట్టు అయింది.
ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీలోపు అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని త్రిబుల్ వైసీపీకి డెడ్ లైన్ పెట్టాడు. ఆ లోపు ఒక వేళ ఆ ప‌నిచేయ‌లేక‌పోతే, తానే నేరుగా అన‌ర్హ‌త‌ను కోర‌తాన‌ని ర‌చ్చ‌బండ వేదిక‌గా చెప్పాడు. ఆ క్ర‌మంలో అన‌ర్హ‌త వేటు వేయించే ప్ర‌క్రియ‌ను వైసీపీ వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టికే స్పీక‌ర్ ను ప‌లుమార్లు క‌లిసి అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఆ పార్టీ ఎంపీలు కోరారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌ను చేస్తున్నాడ‌ని ఆధారాల‌ను కూడా ఇచ్చారు. కానీ, లోక్ స‌భ స్పీక‌ర్ నుంచి స్పంద‌న పెద్ద‌గా లేదు.
న‌ర్సాపురం లోక్ స‌భ ఉప ఎన్నిక‌కు వెళ్లాల‌ని త్రిబుల్ ఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన గ్రౌండ్ ను కూడా త‌యారు చేసుకున్నాడు. విప‌క్షాల‌న్నీ ఆయ‌న‌కు మ‌ద్ధ‌తు ఇచ్చేలా వ్యూహాన్ని ర‌చించుకున్నాడు. అమ‌రావ‌తి, మూడు రాజ‌ధానుల అంశాల‌ను ఎజెండాగా తీసుకుని ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నాడు. ఉప ఎన్నిక‌ల్లో వ‌చ్చే అనుకూల ఫ‌లితాల ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్ ను టార్గెట్ చేయాల‌ని త్రిబుల్ ఆర్ వ్యూహం. అందుకోసం, అన‌ర్హ‌త వేటు కోసం వేచిచూస్తున్నాడు. అన‌ర్హ‌త వేటు వేయించ‌డం వైసీపీ వ‌ల్ల కాద‌ని స‌వాల్ చేశాడు. చేత‌గాని పార్టీగా ప్ర‌జ‌ల్లోకి. తీసుకెళ్లాల‌ని త్రిబుల్ ఆర్ ఆలోచ‌న‌. అందుకే, ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ త‌రువాత తానే అన‌ర్హ‌త కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డం ద్వారా జ‌గ‌న్ పార్టీపై పైచేయిగా నిల‌వాల‌ని చూస్తున్నాడు. ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండా ఆయ‌న్ను అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.అన‌ర్హ‌త వేటుపై అంతిమంగా ఎవ‌రు గెలుస్తారో..చూద్దాం. !