Edible Oils : వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లీటరు పామాయిల్ ధర ఇప్పుడు రూ.130 దాటింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ.145కు చేరుకుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గత మార్చిలో లీటర్ పామాయిల్ ధర రూ.90, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.105గా ఉంది.దీన్నిబట్టి గత ఆరు నెలల వ్యవధిలో వంట నూనెల ధరలు(Edible Oils) ఎంతగా పెరిగిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక లీటర్ వేరుశెనగ నూనె రూ. 165కి చేరింది. దీపారాధనకు ఉపయోగించే నూనె ధర కూడా 130కి పెరిగింది. సన్ ఫ్లవర్ నూనె 15 లీటర్ల టిన్ ధర రూ.2000కు టచ్ అయింది.
Also Read :Nayanthara : ‘‘ధనుష్ క్రూరుడు.. నా హృదయాన్ని ముక్కలు చేశాడు’’.. నయనతార ఫైర్
నూనె ధరల మంటకు కారణాలివీ..
- మలేషియా నూనె ధరల ప్రకారం భారత ప్రభుత్వం నూనె ధరల మార్కెట్ టారిఫ్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి సవరిస్తోంది. ఈక్రమంలో నవంబరు 1 నుంచి లీటర్ పామాయిల్ ధర రూ.18, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.30 చొప్పున పెరిగాయి.
- వంటనూనెలపై కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 24 శాతం మేర ఎక్సైజ్ డ్యూటీని పెంచింది.
- మలేషియా నుంచి వంట నూనెల ముడిసరుకు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరుకు అధికంగా వస్తుంటుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ – గాజా – లెబనాన్ యుద్ధం నేపథ్యంలో మలేషియా నుంచి మన దేశానికి వంటనూనెల ముడిసరుకు సప్లై తగ్గిపోయింది.
- ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద ఎనిమిది వంటనూనె ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి.
- విదేశాల నుంచి ఓడల ద్వారా వచ్చే వంటనూనెల ముడిసరుకును పంటపాలెం నుంచి పైప్‌లైన్ల ద్వారా ఫ్యాక్టరీలకు సప్లై చేస్తారు. ఆయా ఫ్యాక్టరీల్లో ప్యాకెట్లు, డబ్బాల్లో వంటనూనెను నింపి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలకు తరలిస్తారు.
- ప్రతి రోజూ దాదాపు 100 లారీలు పంటపాలెం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాయి.
- మలేషియా నుంచి పంటపాలేనికి ఒక్కో ఓడలో దాదాపు రూ.800 కోట్లు విలువైన వంటనూనెల ముడిసరుకు దిగుమతి అవుతుంటుంది.
- మలేషియా నుంచి భారత్‌కు వచ్చే వంటనూనె ఓడలకు, అందులోని సామగ్రికి ఇన్సూరెన్స్ ఉంటుంది.అయితే ఇజ్రాయెల్ -గాజా -లెబనాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి బీమా కంపెనీలు ఈ ఓడలకు ఇన్సూరెన్స్ చేసేందుకు ముందుకు రావడం లేదు. అందువల్లే మలేషియా కంపెనీలు చాలా తక్కువ సంఖ్యలో వంటనూనెల స్టాక్‌ను భారత్‌కు పంపుతున్నాయి.
- మొత్తం మీద మలేషియా కంపెనీల ఈ నిర్ణయం మనదేశంలో వంట నూనెల ధరల మంటను క్రియేట్ చేసింది.