సినీ నిర్మాత , విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana)తో పాటు ఆయన వ్యాపార భాగస్వాములుగా ఉన్న ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు , గద్దె బ్రహ్మాజీ ఇళ్లలో ఈడీ దాడులు (ED attacks) నిర్వహించింది. విశాఖపట్నంలోని లాసన్స్‌బే కాలనీలోని సత్యనారాయణ ఇల్లు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేసారు. అలాగే మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి.
ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ జీవీ, గద్దె బ్రహ్మాజీ ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేయడం జరిగిదని. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో ఎంవీవీ అక్కడ లేరని తెలుస్తోంది. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పైనే ఈడీ ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.
విశాఖలోని ఎండాడ కొండపై సర్వే నెంబరు 92/3లో గల 12 ఎకరాలను 2008లో హయగ్రీవ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎకరా రూ.45 లక్షలకు కొన్నారు. వయోవృద్ధులకు హౌసింగ్ ప్రాజెక్టు కోసమని తక్కువకు కొనుగోలు చేసి మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణాలు చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది చేతులుమారింది. అక్కడ భారీ విల్లా ప్రాజెక్టులు కడుతున్నారు. కోర్టు కేసులు ఉన్నాయి. తనను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఆ భూమిని కబ్జా చేశారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్‌గా ఉన్న టైంలోనే.. గీతాంజలి, అభినేత్రి, లక్ ఉన్నోడు, నీవెవరో వంటి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విశాఫట్నం ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2024 ఎన్నికలలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
Read Also : Radiotherapy: రేడియోథెరపీ శరీరంలో క్యాన్సర్‌కు కారణమవుతుంది, పిల్లలకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది