AP Polling Timings : ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ

ఈ నెల 13 న ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ కు సంబదించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఈసీ అధికారులు పోలింగ్ కు సంబదించిన టైమింగ్స్ ను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్రంలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 […]

Published By: HashtagU Telugu Desk
Ap Poling Time

Ap Poling Time

ఈ నెల 13 న ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ కు సంబదించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఈసీ అధికారులు పోలింగ్ కు సంబదించిన టైమింగ్స్ ను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్రంలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్సు పిరియడ్ మొదలు అవుతుందని చెప్పారు. అన్ని చోట్లా రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే 6 గంటల తర్వాత స్థానికులు కానీ రాజకీయ నేతలు అంతా నియోజకవర్గాల్లో నించి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. పత్రికల్లో ప్రకటనల కోసం ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని అన్నారు. రేపు సాయంత్రం ఈవీఏంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తారని తెలిపారు. పోలింగ్‌కు 90 నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహిస్తామని వివరించారు. ఓటర్లను రాజకీయ పార్టీలు తరలించడం చట్ట వ్యతిరేకమని అన్నారు. అభ్యర్థికి సంబంధించి వాహనాల పరిమితి ఉందన్నారు. మూడు వాహనాల వరకే సదరు అభ్యర్థి వినియోగించుకోవచ్చని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకెవెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదన్నారు.

Read Also : AP TDP: జగన్  ని ఓడిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్

  Last Updated: 11 May 2024, 05:42 PM IST