E-Office: ఏపిలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఆదేశించింది. ఏపిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ స్టాఫ్ట్ వేర్‌ను అప్‌గ్రేడ్ చేఏందుకు ఎన్‌ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) ఈనెల18 నుండి 25 వరకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
అయితే గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ-ఆఫీస్‌ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసే పేరుతో వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు.. గవర్నర్, ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ‘ఈ-ఆఫీస్’ అప్ గ్రేడేషన్‌పై ఎన్‌ఐసీ ప్రతినిధులను పిలిపించి ఆరా తీశారు. అనంతరం అప్‌గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్‌ఐసీని ఎంకే మీనా ఆదేశించారు. అనంతరం, సాంకేతిక కారణాలతో ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ను వాయిదా వేస్తున్నట్టు ఎన్ఐసీ వెల్లడించింది.
Read Also: Prabhas : రేపు సాయంత్రం తన బుజ్జిని పరిచయం చేస్తానంటున్న బుజ్జిగాడు..
కాగా, ఈనెల 18 నుంచి 25 వరకు ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ చేపట్టనున్నట్టు ఇప్పటికే ఎన్‌ఐసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో తదుపరి షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించింది. ప్రస్తుతం ఉన్న ఈ- ఆఫీస్ వెర్షన్‌తోనే విధులు నిర్వహించాలని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది.