Site icon HashtagU Telugu

Macherla : పిన్నెల్లి దాడి… పీఓ సహా సిబ్బందిపై ఈసీ వేటు

Macherla Evm

Macherla Evm

మాచర్ల ఎమ్మెల్యే (Macherla YCP MLA ) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం (EVM) ను ధ్వంసం చేసిన ఘటనఫై ఈసీ వేటు వేసింది. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. మాచర్ల పోలింగ్ బూత్‌లో జరిగిన సంఘటనలో పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లో అడుగు పెట్టగా.. అక్కడ ఉన్న పీఓ, ఇతర సిబ్బంది లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం.. ఈవీఎం ను నేలకేసి కొట్టి పగలగొడుతుంటే పోలింగ్ సిబ్బంది ఈ చర్యను వ్యతిరేకించలేదు అనే అభియోగాలపై సస్పెండ్ చేసింది. రేపటి (గురువారం) లోపు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశాలలో పేర్కొంది.

మరోపక్క ఈ దాడికి పాల్పడిన పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల బృందం డీజీపీని కలిసి మెమోరాండం ఇచ్చారు. నేతల బృందం పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఫుటేజ్ ను డీజీపీకి అందజేశారు. పోలింగ్ రోజు తర్వాత రోజు ఒక పథకం ప్రకారం పిన్నెల్లి దాడులు చేసారని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. మాచర్లలో అరాచకం సృష్టించాలని పిన్నెల్లి నామినేషన్ రోజు నుంచి ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. హత్యాయత్నం కేసులు పెట్టాల్సిన పోలీసులు నామమాత్ర కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పిన్నెల్లి పై 307 కేసు పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేసారు. పిన్నెల్లి పై అనర్హత వేటు వేయాలన్నారు. సీఎస్ జవహర్ రెడ్డి వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొన్నాయని విమర్శించారు.

Read Also : AP : ఈసీకి జనసేన సూటి ప్రశ్న..డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చడం లేదు