EC Notices To Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఈసీ నోటీసులు

అనకాపల్లి సభలో సీఎం జగన్ ఫై చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 09:27 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఎన్నికల సంఘం నోటీసులు (EC Notices) జారీ చేసింది. ఇటీవల అనకాపల్లి సభలో సీఎం జగన్ (CM Jagan) ఫై చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసుల్లో పేర్కొంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదుతో ఈసీ స్పందించింది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా జనసేన అధినేత అనకాపల్లి సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి జగన్‌ స్కాం స్టార్‌, ల్యాండ్‌ గ్రాబర్‌, సాండ్ అండ్‌ లిక్కర్‌ ఎంపరర్‌ అంటూ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ స్పందించి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్‌కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. పవన్ వివరణ సంతృప్తికరంగా ఉంటే సీఈవో వదిలేసే అవకాశముంది. సంతృప్తి చెందకపోతే మాత్రం తదుపరి చర్యల కోసం సీఈసీకి ఈ వ్యవహారాన్ని నివేదిస్తారు.

Read Also : Nara Lokesh : బీజేపీ కోసం తమిళనాడు వెళ్తున్న నారా లోకేష్..!