టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)కు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. వైసీపీ పార్టీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా..చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ ఫై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టిందని వైసీపీ చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌పై సీఎం జగన్ వ్యక్తిత్వంపై దాడి చేసేలా ప్రచారం చేస్తున్నారని, అసభ్యకర ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పందిస్తూ నోటీసులు పంపారు. టీడీపీ సోషల్‌మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె..ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లింలలో భయాందోళనలు రేకెత్తించేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీతో పొత్తుపై వైసీపీ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో పలువురు ముస్లిం సంఘాల నేతలు చంద్రబాబును కలిసి ఈ మేరకు వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా మతపరమైన అంశాల్లో ఇబ్బందులు ఉండబోవన్నారు. సీఎం జగన్ మొహంలో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కోడికత్తి డ్రామా నుండి బాబాయ్ హత్య వరకూ అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్ .. ఇప్పుడు మతాలు, కులాలపై పడ్డారని విమర్శించారు.
Read Also : Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు