AP : ఏపిలో సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఆంక్షలు విధించిన ఈసీ

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 02:05 PM IST

Welfare scheme: ఏపిలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం(Election Commission) ఆంక్షలు విధించింది. పోలింగ్‌ తర్వాతే నగదు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే బటన్‌ నొక్కిన పథకాల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకు వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌కు ముందే వివిధ పథకాల కోసం సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.14,165 కోట్లు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. దీనికి ఈసీ అభ్యంతరం తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

”నిధుల జమ ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలి. డీబీటీతో వెంటనే నగదు లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నా ఎందుకు ఆలస్యమైంది?ప్రచారం ముగిశాక జమ చేసే యత్నం జరుగుతోంది. పోలింగ్‌కు 2 రోజుల ముందువేస్తే కోడ్‌ ఉల్లంఘనే అవుతుంది” అని ఈసీ పేర్కొంది. ఎన్నికలు పూర్తయ్యాకే ఆ నిధులను జమ చేయాలని.. మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత దీనిపై మార్గదర్శకాలు ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

Read Also: Heat Stroke: పిల్ల‌ల్లో హీట్ స్ట్రోక్ ల‌క్ష‌ణాలివే.. స్ట్రోక్ నుండి వారిని ర‌క్షించుకోండిలా..!

కాగా, ఏపీలో కొనసాగుతున్న డీబీటీ పథకాల నిలుపుదల పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అమల్లో ఉన్న డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ నిధుల విడుదలను అడ్డుకోవడంపై రైతులు, విద్యార్థులు హైకోర్టుకు వెళ్లారు. జగనన్న విద్యాదీవెన కింద 768 కోట్లు విడుదల చేయాల్సి ఉందని పిటిషన్ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే 97 కోట్లు విడుదల చేశారని, మిగతావి విడుదల చేయాల్సి ఉందని తెలిపారు. లబ్దిదారులు కొత్తవారు కాదని కోర్టుకు తెలిపారు. అటు చేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై మహిళ సంఘం సభ్యులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈరోజుకి వాయిదా వేసింది.