Janasena : జనసేనకు షాక్ ఇచ్చిన ఈసీ..

ఈసీ గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను విడుదల చేసింది

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 01:44 PM IST

జనసేన (Janasena) పార్టీ కి ఈసీ (EC) నుండి ఏదో ఒక ఎదురవుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న గ్లాస్ సింబల్ షాక్ ఇచ్చిన ఈసీ..ఇక ఇప్పుడు అంత సెట్ అయ్యిందని అనుకుంటున్నా టైం లో తాజాగా ఈసీ గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ, వైసీపీకి చోటు దక్కగా.. జనసేన పార్టీకి మాత్రం రిజిస్టర్ పార్టీల జాబితాలో ఎన్నికల సంఘం చోటు కల్పించింది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాస్ గుర్తు(జనసేన గుర్తు) ఉంది. దీనిపై జనసేన పార్టీ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. జనసేన పార్టీ సింబల్ గ్లాస్ గుర్తు ఒకవేళ ఫ్రీ సింబల్ లో ఉంటే.. ఇండిపెండెంట్ గా పోటీ చేసే వారికి కూడా.. ఎంపిక ద్వారా గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఎన్నికల్లో జనసేన పార్టీకి భారీ నష్టం జరుగుతుంది. మరి దీనిపై జనసేన ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన జనసేన..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో కూటమి తో చేతులు కలిసి బరిలోకి దిగుతుంది. 21 అసెంబ్లీ స్థానాల్లో , 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. అధినేత పవన్ పిఠాపురం నుండి బరిలోకి దిగుతున్నారు. గత మూడు రోజులుగా పవన్..పిఠాపురంలో పర్యటిస్తూ వస్తున్నారు. ఈరోజు తో పిఠాపురం పర్యటన ముగుస్తుంది.

Read Also : Ajay Devgn Car Collection: ఈ బాలీవుడ్ హీరో కార్ల క‌లెక్ష‌న్స్‌ చూస్తే మ‌తిపోవాల్సిందే.. 2006లోనే రూ. 3 కోట్ల విలువ చేసే కారు..!