AP Intelligence DG : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమించింది

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 09:54 PM IST

సార్వత్రిక ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ (AP Intelligence DG Kumar Vishwajeet)గా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీ (Vijayawada CP)గా పీహెచ్ రామకృష్ణ (Ph. Ramakrishna)ను నియమించింది. వైసీపీ అధినేత , సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన దాడి ఘటన ఫై ఈసీ (EC) సీరియస్ అయినా సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈ దాడి నేపథ్యంలో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడ సీపీ కాంతిరానా టాటా (Vijayawada CP Kanthi Rana Tata), ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు (Intelligence Chief PSR Anjaneyulu)ను బదిలీ చేసింది. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలని , వారికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పజెప్పాలని ఈసీ ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమించడమే కాదు.. రేపు ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం నడుస్తుంది..అలాగే అన్ని పార్టీల నేతలు తమ తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. ఇదే క్రమంలో ఈసీ సైతం ఎన్నికల విషయంలో చాల సీరియస్ గా వ్యవహరిస్తోంది..ఎన్నికల కోడ్ ను ఉల్లగించిన..నిబంధనలు పాటించకపోయిన వారిపై సీరియస్ అవుతూ..నోటీసులు జారీ చేస్తుంది. ఇప్పటికే అన్ని పార్టీల కీలక నేతలు పలు విషయాలపై నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక రేపు జగన్ కడప లో నామినేషన్ వేయబోతున్నారు. ఈ క్రమంలో పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తుంది.

Read Also : CM Jagan : బీజేపీకి విధేయుడినే.. చెప్పకనే చెప్పిన జగన్