Early Elections in AP..? బాబు జైల్లో ఉండగానే ఎన్నికలు పూర్తి చేయాలనీ జగన్ చూస్తున్నాడా..?

నెల రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండడం తో టిడిపి శ్రేణులంతా అయోమయంలో పడ్డారు. టీడీపీ కి ఇప్పుడు సరైన నాయకుడు లేడు. నారా లోకేష్ ఢిల్లీ లోనే ఎక్కువ గా గడుపుతున్నాడు.

  • Written By:
  • Publish Date - October 7, 2023 / 05:17 PM IST

ఏపీలో ముందస్తు ఎన్నికలు (Early Elections in AP) జరగబోతున్నాయా..? జగన్ కసరతులు మొదలుపెట్టాడా..? అందుకే జగన్ (Jagan) ఢిల్లీకి వెళ్లి ముందస్తు ఎన్నికల ఫై ఆరా తీసాడా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. సీఎం జగన్ మూడు రోజుల ఢిల్లీ టూర్ ముగించుకొని..ఈరోజు ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టూర్ లో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. వారిలో హోం శాఖా మంత్రి అమిత్ షా (Amith Sha) కూడా ఉన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని , అలాగే కృష్ణా జలాల అంశంపై తీవ్ర అభ్యంతరం వంటివి అమిత్ షా తో విన్నవించారు. వీటితో పాటు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫై కూడా ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఏపీలో ముందస్తు ఎన్నిక (Early Elections in AP ) సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్‌ను వివరాల కోరారు అమిత్ షా. ఒకవేళ ఏపీలో ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వస్తే..తెలంగాణ లో ఎన్నికలకు కాస్త ఆలస్యం కానుంది. వాస్తవానికి డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Election) జరగాలి..డిసెంబర్ 15 న ఫలితాలు రావాలి. కానీ ఇప్పుడు ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగితే మాత్రం తెలంగాణ ఎన్నికలకు బ్రేక్ పడినట్లే.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. నెల రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండడం తో టిడిపి శ్రేణులంతా అయోమయంలో పడ్డారు. టీడీపీ కి ఇప్పుడు సరైన నాయకుడు లేడు. నారా లోకేష్ ఢిల్లీ లోనే ఎక్కువ గా గడుపుతున్నాడు. టీడీపీ తో పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్..నిన్నటి వరకు వారాహి యాత్ర చేసాడు. ఇక ఇప్పుడు సినిమాలతో బిజీ కానున్నారు. ఈ తరుణంలో జగన్ తన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాడు. చంద్రబాబు అవినీతి ఆరోపణలు , నిలకడ లేని పవన్ రాజకీయాలు వంటి అంశాలను ప్రజలకు వివరిస్తూ..ప్రజల ఓట్లు రాబట్టుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదంతా కూడా చంద్రబాబు జైల్లో ఉండగానే పూర్తి చేయాలనీ..బాబు జైల్లో ఉండగానే ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ వర్క్ అవుతుందా..? అనేది చూడాలి.

Read Also : Hyderabad: మత రాజకీయాలు..అసదుద్దీన్ పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారా?