ఏపీలో పలు స్కామ్ కేసులు సంచలనంగా మారాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ (Skill Development Scam) , ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ (Amaravati Inner Ring Road Scam) లు వార్తలు నిలువగా..తాజాగా ఈ – చలానా స్కామ్ (E Challan Scam) ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేసింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల పేరుతో ప్రజల నుంచి జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తంలో రూ.36.53 కోట్లు దారి మళ్లాయి. ఈ స్కామ్ పై గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ( IG Pala Raju) వివరాలు వెల్లడించారు. కొమ్మిరెడ్డి అవినాష్ (Avinash Kommireddi) కు చెందిన రేజర్ పీఈ ఖాతాకు డబ్బంతా మళ్లించారని, దీంతో పీఈ ఖాతా నుంచి నగదు డీజీ ఖాతాకు జమ కాలేదన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబరులో తిరుపతి యూనిట్ లో గుర్తించామని తెలిపారు.
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులు విశ్రాంత డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్, ఆయన చెల్లెలు అక్షిత, రవికిరణ్ అనే మరో వ్యక్తి కీలక నిందితులు’’ అని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు తెలిపారు. ఈ చల్లాన్ ద్వారా రూ.101 కోట్లకు పైగా వసూలు చేసిన డేటా ఇవాల్వ్ సంస్థ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని సొంత ఖాతాలకు తరలించారు. డేటా సొల్యూషన్ ప్రతినిధి రాజశేఖర్ ను ప్రశ్నించినట్లు చెప్పారు. సరైన సమాచారం ఇవ్వకుండా అవినాష్ కాలయాపన చేశారని, అందుకే రాజశేఖర్ ను అరెస్ట్ చేసి విచారించగా, నిధుల దుర్వినియోగం చేసినట్లు అంగీకరించాడని వెల్లడించారు. ఈ క్రమంలో అవినాష్ ఆస్తుల విషయమై సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాశామని, ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపేసేలా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. త్వరలోనే అవినాష్ ను పట్టుకుంటామని ఐజీ పాలరాజు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘2015నుంచి పోలీస్‌శాఖ ఈ చలాన్‌ను కృష్ణా సొల్యూషన్స్ అనే సంస్థ ఆన్‌లైన్ సర్వీసెస్ ద్వారా వసూలు చేసేది. ఇందుకుగాను రూ.5 యూజర్ చార్జీ వసూలు చేసేవారు. ఆ సంస్థ సమర్థంగా పనిచేయడంలేదనే కారణంతో 2017 జూన్ నుంచి డాటా ఇవాల్వ్ అనే సంస్థ సేవలు వినియోగించుకున్నాం. 2018 డిసెంబరులో ఈ చలాన్ వసూళ్లకు సంబంధించి రూ.2కోట్లు చెల్లించే విధంగా ఓపెన్ టెండర్ పిలిచాం. ఇందులో కృష్ణా సొల్యూషన్స్ సంస్థ ఏడాదికి 1.97 కోట్లు కోట్ చేయగా, డాటా ఇవాల్వ్ సంస్థ ఒక్క రూపాయి కోట్ చేసింది. అదేమిటంటే… లాభాపేక్ష లేకుండా నిర్వహించి ఆ తర్వాత మిగిలిన రాష్ర్టాలకు విస్తరించుకుంటామని వారు చెప్పారు. దీంతో ఈ కాంట్రాక్ట్‌ను డాటా ఇవాల్వ్ సంస్థకు కేటాయించాం. కొమ్మిరెడ్డి అవినాశ్, ఆయన చెల్లెలు అక్షిత, రవికిరణ్ అనే మరోవ్యక్తి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ 2019 నుంచి ఈ చలాన్ సొమ్మును పేటీఎం, ఏపీ ఆన్‌లైన్, మీసేవ, కార్డ్స్, జాక్ పే, మోబికిక్, రజోర్ పే… ఇలా అనేక గేట్‌వేల ద్వారా డీజీపీ ఖాతాలోకి జమ చేస్తున్నట్లు పాలరాజు తెలిపారు.
Read Also : BRS Votes to TRS : బీఆర్ఎస్ ఓట్లు టీఆర్ఎస్ కు..?