Site icon HashtagU Telugu

Dwarampudi vs Pawan: పవన్… నీకు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు

Dwarampudi vs Pawan

New Web Story Copy 2023 06 19t131234.136

Dwarampudi vs Pawan: పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన ప్రకంపనలు సృష్టించింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ పై కాకినాడ ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వర్సెస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న చందంగా మారింది.

కాకినాడ పర్యటనలో పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. పవన్ మాట్లాడుతూ… ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. నీ అంతు చూస్తా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నిన్ను, నీ సీఎంని రోడ్డుకు ఈడుస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నా ఆడబిడ్డలపై నీ అరాచకాలు ఇక సాగనివ్వను, నీ నేర సామ్రాజ్యాన్ని కూలగొడతానని, నీకు అనుమానం ఉంటే ఈ వీడియో దగ్గర పెట్టుకో, నీ అంతు చూడకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ద్వారంపూడి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

పవన్ వ్యాఖ్యలపై ద్వారంపూడి స్పందిస్తూ… పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పదేళ్ల క్రితం జనసేన ఎవరిని ఉద్దేశించి పెట్టినవ్ అని ఘాటుగా ప్రశ్నించారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ సున్నా అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు కాకపోతే అది కేవలం సినిమాల్లో మాత్రమేనంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. కాకినాడ ప్రజలు రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ మాత్రమేనని అన్నారు ద్వారంపూడి. మూడు నెలల్లో పవన్ రెండు మాటలు మాట్లాడారని, మార్చిలో తనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదన్న పవన్ మూడు నెలల తరువాత తనని ముఖ్యమంత్రిని చెయ్యండని ప్రజల్ని వేడుకొనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు ద్వారంపూడి.

పవన్ కళ్యాణ్ తుపాకీ చేత పట్టుకుని తిరిగాడు. నేను ఏనాడూ తుపాకీ పట్టింది లేదన్నారు ద్వారంపూడి. 15 వేల కోట్ల అవినీతి ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ మాటలతో చెబితే నేను చేతల్లో చూపిస్తాను. రాజకీయంగా ఎదుర్కొంటాను అన్నారు. పవన్ కళ్యాణ్.. నీకు దమ్ముంటే కాకినాడలో పోటీ చేసి నాపై గెలువు అని సవాల్ విసిరారు. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ ప్రశ్నించారు.

Read More: Komatireddy Brothers: తమ్ముడి ఘర్ వాపసికి అన్న ప్రయత్నం!