Site icon HashtagU Telugu

Duvvada : బెదిరింపులకు దిగిన దువ్వాడ శ్రీనివాస్ రావు

Duvvada Call

Duvvada Call

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల ప్రవర్తనపై విమర్శలు పెరుగుతున్నాయి. అధికారాన్ని కోల్పోయినా, వైసీపీ నేతలు తమ పద్దతులు మార్చుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) రెచ్చిపోయిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఇంటికి సంబంధించిన రూ. 56,000 కరెంటు బిల్ (Electricity Bill) చెల్లించకపోవడంతో లైన్‌మన్ కరెంట్ సప్లై కట్ (Lineman cut the current supply) చేయగా దువ్వాడ ఆగ్రహంతో ప్రభుత్వ ఉద్యోగిని ఫోన్‌లో బెదిరించారు. “ఎంత ధైర్యం ఉంటే నా ఇంటి కరెంటు కట్ చేస్తావ్?” అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

TDP Formation Day : టీడీపీ ఆవిర్భవించి 43 ఏళ్లు.. పార్టీ చరిత్రలో కీలక ఘట్టాలివీ

దువ్వాడ శ్రీనివాస్ వైఖరిని చూస్తుంటే.. అధికారాన్ని కోల్పోయినా వైసీపీ నేతల్లో మదం తగ్గలేదని స్పష్టమవుతోంది. ప్రజాప్రభుత్వ వ్యవస్థలు తమ సొంత పరిపాలనా యంత్రాంగం అనుకున్నట్టుగా ఆయన ప్రవర్తన కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇలా ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు దిగుతుంటే, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ నేతలు అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో చేసుంటారో ఊహించుకోవచ్చు. కరెంట్ బిల్ కట్టకపోతే సామాన్య ప్రజల ఇంటికి ఎలా కరెంట్ నిలిపేస్తారో, అదే నియమం ప్రజాప్రతినిధులకు ఎందుకు వర్తించకూడదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పని విధుల్లో రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతుందా? అధికార పార్టీ మారిన తర్వాత కూడా, వైసీపీ నేతలు తమ హోదా దుర్వినియోగం చేయడం చూసి, ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ, వైసీపీ నేతలు ఇప్పటికీ తమ అధికారం కొనసాగుతుందన్న భ్రమలోనే ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చూస్తుంటే కొత్త ప్రభుత్వానికి నిబంధనలు కఠినతరం చేసి, ఇలాంటి అవినీతి విధానాలకు గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.