Duvvada Srinivas Family Issue : ఎవరిది తప్పు..? ఎవరిది ఒప్పు..?

దివ్వెల మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణియేనని , నాకు, మాధురికి మధ్య వాణి లేని పోనివి అంటగట్టిందని

Published By: HashtagU Telugu Desk
Duvvada Story

Duvvada Story

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ (YCP MLC Duvvada Srinivas) కుటుంబంలో నడుస్తున్న గొడవ గురించి..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంటి గోడలు దాటి, రోడ్లు దాటి..ఇప్పుడు పోలీస్ స్టేషన్ , మీడియా ముందు వరకు వచ్చింది. గత కొద్దీ నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ అతడి భార్య కు మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ వయసు 60 ఏళ్లు..ఈ వయసులో కుటుంబం తో కలిసి ఉండకుండా మాధురి తో అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భార్య, కూతుళ్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా టెక్కలి జాతీయ రహదారిపై నూతనంగా శ్రీనివాస్ నిర్మించుకున్న ఇంటి వద్ద ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. నిన్న రాత్రి కూడా అలాగే ఆందోళన చేయగా..శ్రీనివాస్..భార్య , కూతుళ్ల ఫై దాడికి ట్రై చేయబోయాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇక ఈరోజు శనివారం తనపై హత్యాయత్నం చేశారంటూ భార్యా , పిల్లలపై దువ్వాడ ఫిర్యాదు పోలీసులకు చేశారు. నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నారు. భార్యా, పిల్లల నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. వాణితో తాను విడాకులు తీసుకుంటానని దువ్వాడ స్పష్టం చేశారు. అధికార పార్టీ అండతో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. ఎస్పీ తిరస్కరించారని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..దివ్వెల మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణియేనని , నాకు, మాధురికి మధ్య వాణి లేని పోనివి అంటగట్టిందని, దీంతో మాధురి ఆత్మహత్య చేసుకోబోయింది అని నా ఫ్యామిలీ వల్ల చనిపోబోయిన ఆమెకు నేను దగ్గర అయ్యాను. కలిసి తిరిగాను. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు మాధురి సపర్యలు చేసింది. ఎన్నికల్లో నా కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసింది’ అని దువ్వాడ వివరించారు.

అలాగే శ్రీనివాస్ తల్లి సైతం మీడియా తో మాట్లాడుతూ వాణీ మంచిది కాదని తన కొడుకును ఇబ్బందికి గురి చేస్తుందంటూ చెప్పుకొచ్చింది. వాణికి మందు పిచ్చి, డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కాంక్షతో తన కొడుకును హింసిస్తోందని, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని తెలిపింది. తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులు ఇవ్వమని ఎప్పట్నుంచో చెబుతున్నానని తెలిపారు. ప్రేమ వివాహం కాబట్టి వాణితోనే శ్రీను కొనసాగాడని చెప్పారు. కానీ తన మనమరాళ్లు కూడా శ్రీనును తిట్టడం చూస్తుంటే బాధ కలుగుతోందని వాపోయారు. దువ్వాడ శ్రీను ఉంటున్న ఇల్లు తన చిన్న కొడుకు శ్రీధర్‌ కట్టించాడని తెలిపారు. ఆ ఇంటితో శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వాణికి చెందదని తేల్చి చెప్పింది.

అలాగే మాధురి సైతం మీడియా మాట్లాడుతూ.. తననే దువ్వాడ శ్రీనివాస్‌ సతీమణి వాణి రాజకీయంగా తనను ట్రాప్‌ చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్‌ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు. వాణినే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు తానెవరో తెలియదని అంటుందని విమర్శించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు, వాణికి మధ్య ఏవైనా విబేధాలు ఉంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. వాణి మాటలు పట్టుకుని అనవసరంగా తనను ఇందులోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్‌ను వాణి ఇంట్లోకి రానివ్వకపోతే తన ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చిందని , శ్రీనివాస్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ జీరో అని.. అతని వద్ద ఆస్తులేమీ లేవని ఆమె స్పష్టం చేసింది. ఉన్నవన్నీ కుటుంబానికే దారాధత్తం చేశారని చెప్పుకొచ్చింది. మరి వీరిలో ఎవర్నిది ఒప్పు..ఎవర్ని తప్పు అనేది కోర్ట్ తేల్చాల్సి ఉంది.

Read Also : Narendra Modi : వయనాడ్‌ విలయంలో చిక్కుకున్నవారికి అండగా నిలవాలి

  Last Updated: 10 Aug 2024, 06:44 PM IST