Duvvada Srinivas : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి ల మధ్య సంబంధం ఇటీవల కాలంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉన్నట్లు భావిస్తున్న సంఘటన ఒకటి ఇటీవల దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలో చోటు చేసుకుంది. ఈ వేడుకలో, దువ్వాడ శ్రీనివాస్ ఆమెకు ప్రత్యక్షంగా ప్రపోజ్ చేసి, వారి మధ్య బంధానికి క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ ప్రపోస్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి, వీరి మధ్య ఉన్న ప్రేమను మరింత ప్రజల మధ్య చర్చకు దారి తీసింది.
పుట్టిన రోజు వేడుకలో, దువ్వాడ శ్రీనివాస్ తన ప్రేమను వెల్లడిస్తూ, “నేను ఎప్పటికీ మాధురిని ప్రేమిస్తాను” అని చెప్పారు. దీనికి సమాధానంగా మాధురి కూడా తన ప్రేమను వ్యక్తం చేస్తూ, “నేను కూడా ఎప్పటికీ రాజా నిన్నే ప్రేమిస్తాను” అని అన్నారు. ఒక మీడియా ప్రతినిధి సూచన మేరకు, ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ప్రేమించుకుంటున్నామని చెప్పుకోవడం ఈ వీడియోలో ఉంది.
ఈ సందర్భంగా, దువ్వాడ శ్రీనివాస్ తమ సంబంధం గురించి మాట్లాడారు. వారు తమకిష్టమైన పనులను, ప్రజల సేవలో నిజాయితీతో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. “మేము మనస్పూర్తిగా కలిసాం.. మేము మనస్పూర్తిగా పని చేసుకుంటున్నాం.. మేము మనస్పూర్తిగా ప్రజా సేవలో ముందుకు సాగుతాం.. ప్రజలకు సేవ చేయడానికి నిజాయితీతో ప్రయాణం కొనసాగిస్తున్నాం” అని ఆయన తన మాటల్లో తెలిపారు.
ఇంకా, దువ్వాడ శ్రీనివాస్ తన పుట్టిన రోజుకు మాధురి ఇచ్చిన గడియారం గురించి కూడా ప్రస్తావించారు. “ఆమె నా బర్త్‌డేకు గడియారానికి గిఫ్ట్‌గా ఇచ్చారు.. ఇప్పుడు ఆమె బర్త్‌డే అంతకు మించి నేను ఇవ్వాలి’ అని హాస్యంగా చెప్పారు శ్రీనివాస్. ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ దెవ్వెల మాధురిని ప్రేమిస్తున్నట్లు ఆమె ప్రప్రోస్ చేశారు. అయితే.. దువ్వాడ శ్రీనివాస్ ప్రేమను మాధురి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ వీడియోలోనే ఓ సీనియర్ జర్నలిస్టుల కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు.
Read Also : CM Chandrababu : అమరావతి నిర్మాణానికి 31000 కోట్లు సిద్ధం..