వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ (YCP MLC Duvvada Srinivas) కుటుంబంలో మొదలైన గొడవలు ఇంటి గోడలు దాటి, రోడ్లు దాటి..ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. తనపై భార్య , పిల్లలు హత్యాయత్నానికి ట్రై చేసారంటూ దువ్వాడ పోలీసులకు పిర్యాదు చేసాడు. ఇంటి గేట్లు విరగ్గొట్టడమే కాకుండా తనపై హత్యాయత్నం చేయబోరని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
గత కొద్దీ నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ అతడి భార్య కు మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ వయసు 60 ఏళ్లు..ఈ వయసులో కుటుంబం తో కలిసి ఉండకుండా మాధురి తో అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని కూతుళ్లు ఆరోపిస్తున్నారు. టెక్కలి జాతీయ రహదారిపై నూతనంగా శ్రీనివాస్ ఓ ఇంటిని నిర్మించుకున్నారు. గురువారం ఆ ఇంటికి వెళ్లిన ఇద్దరు కుమార్తెలను లోపలికి అనుమతించక పోవడంతో..మరోసారి నిన్న రాత్రి తల్లితో కలిసి ఇంటి ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేసారు.
దీంతో చాలాసేపటి తర్వాత బయటికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ భార్యా పిల్లలపై రెచ్చిపోయారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగారు. అక్కడే ఉన్న రాడ్ తీసుకుని వారిపైకి దాడి చేసేందుకు వెళ్లగా..పోలీసులు అడ్డుకున్నారు. నన్ను రోడ్డుకి ఈడుస్తారా అంటూ శ్రీనివాస్ నానా రచ్చ చేసాడు. ఇక ఈరోజు శనివారం తనపై హత్యాయత్నం చేశారంటూ భార్యా , పిల్లలపై దువ్వాడ ఫిర్యాదు పోలీసులకు చేశారు. నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నారు. భార్యా, పిల్లల నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. వాణితో తాను విడాకులు తీసుకుంటానని దువ్వాడ స్పష్టం చేశారు. అధికార పార్టీ అండతో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. ఎస్పీ తిరస్కరించారని తెలిపారు.
Read Also : Imane Khelif: పారిస్ ఒలింపిక్స్.. స్వర్ణ పతకం గెలిచిన వివాదాస్పద మహిళా బాక్సర్..!