వైసీపీ నుండి సస్పెండ్ అయిన తర్వాత దువ్వాడ శ్రీను (Duvvada Srinivas) పూర్తిగా ఉల్లాసంగా గడిపేస్తున్నారు. ఇటీవల టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో దివ్వెల మాధురీతో కలిసి టూర్లు, రీల్స్ చేస్తూ సరదాగా కనిపిస్తున్నారు. అయితే గతంలో ఆయన రాజకీయాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయనను వదిలిపెట్టడం లేదు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నాయి. చంద్రబాబు నుంచి నెలకు యాభై కోట్లు తీసుకుంటున్నారని, తన వద్ద దానికి సాక్ష్యాలున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.
దువ్వాడ శ్రీను వైసీపీలో ఉన్నప్పుడు విపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయడంలో ముందుండేవారు. అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో హద్దులు దాటి ప్రవర్తించేవారు. కానీ, పార్టీ నుంచి తప్పించాక ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. మీడియా సమావేశాల్లో, ఇంటర్వ్యూలలో వైసీపీ గురించి మాట్లాడాల్సి వస్తే వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. జగన్‌పై కూడా మర్యాదగా విమర్శలు చేయడమే మానుకున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆడుగడ్లు ఇప్పుడు ఆయనకు భారమవుతున్నాయి.
Vizag Land Prices : వైజాగ్ భూముల ధరల పై ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు
దువ్వాడ శ్రీను రాజకీయ జీవితంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. అప్పట్లో జనసేన కార్యకర్తలు ఆయనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు కేసుగా మారింది. పైకి ఆయన నిర్లక్ష్యంగా, సరదాగా వ్యవహరిస్తున్నా, వాస్తవానికి పాత కేసులు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు పూర్తిగా హాస్యంగా మారిపోయినప్పటికీ, అప్పట్లో చేసిన తప్పిదాలకు శిక్ష తప్పదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
వైసీపీలో ఉన్నప్పుడు పదవుల కోసం చేసిన విమర్శలు, వ్యాఖ్యల వల్ల ఇప్పుడు దువ్వాడ శ్రీను చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సమస్యలు, సోషల్ మీడియా వినోదంతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నప్పటికీ, గతంలో చేసిన రాజకీయ ఘోరాలు ఇప్పుడు ఆయనను వెంటాడుతున్నాయి. వైసీపీలో పదవి కోసం ఎదురు మాట్లాడిన ప్రతి మాటకు ఇప్పుడు న్యాయస్థానం ముందు సమాధానం చెప్పాల్సిన దశకు ఆయన చేరుకుంటున్నారు.