Site icon HashtagU Telugu

Dussehra Holidays : ఏపీ స్కూళ్లకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..

Dussehra Holidays

Dussehra Holidays

Dussehra Holidays : ఏపీలోని గవర్నమెంట్ స్కూళ్లకు దసరా సెలవులు ఖరారయ్యాయి. అక్టోబర్ 13 నుంచి  25 వరకు దసరా సెలవులను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల విద్యార్థులకు అక్టోబరు 5 నుంచి 11 ఎస్ఏ-1 పరీక్షలు ఉన్నాయి. 8వ తరగతి విద్యార్థులకు మినహా.. మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ముగియగానే అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు మొదలవుతాయి. అక్టోబరు 26 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.

Also read : Chandrababu Arrest : నిరాహార దీక్ష కు సిద్దమైన నారా భువనేశ్వరి

ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. ఈ సమాచారంతో కూడిన సర్కులర్ ను అన్ని పాఠశాలలకు పంపుతున్నారు. గతంలో రెండేళ్ల పాటు కరోనా కారణంగా విద్యాసంవత్సరాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో సెలవులపైనా ప్రభావం పడింది. కానీ ఈ ఏడాది మాత్రం అలాంటి ఇబ్బందులు ఏవీ లేకపోవడంతో విద్యాసంవత్సరం సాఫీగా సాగిపోతోంది. దీంతో విద్యార్ధులకు దసరాతో పాటు ఇతర సెలవులు కూడా షెడ్యూల్ ప్రకారమే ఇవ్వబోతున్నారు. ఇక అక్టోబర్ నెల ప్రారంభంలోనే వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. అక్టోబర్ 1న ఆదివారం వచ్చింది. అలానే 2వ తేదీన గాంధీ జయంతి ఉంది. ఈ కారణంగా రెండు రోజులు కూడా వరుస సెలవులు వచ్చాయి.

Exit mobile version