ఏపీలో ప్రభుత్వ అధికారుల (AP Government Employees) అత్యుత్సాహం రోజు రోజుకు ఎక్కువైపోతోంది. ముఖ్యంగా సీఎం జగన్ (CM Jagan) వస్తున్నాడంటే చాలు ఎక్కడలేని నిబంధనలు , హౌస్ అరెస్ట్ లు , షాపుల మూసివేత , జనాలను తరలించడం ఇవన్నీ చేస్తున్నారు. అంతే కాదు జగన్ వచ్చే దారుల్లో రోడ్ల ఫై ఉన్న చెట్లను సైతం కొట్టివేస్తూ వస్తున్నారు. ఇలా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఫై ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాదు హిందూ దేవాలయాల ఫై కూడా పలు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఇప్పుడు జగన్ సభ (Jagan Public Meeting)కు దుర్గామాత మండపం (Durgamata Mandapam Removed) అడ్డుగా ఉందని చెప్పి అధికారులు తొలగించడం ఫై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కడప లో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరులో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వీవర్స్ కాలనీ మైదానంలో భక్తులు దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు భక్తులు. అయితే, ఈ నెల 19న సీఎం జగన్ ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఈ మైదానంలో సీఎం సభ జరగనుంది. ఈ సభకు మండపం అడ్డుగా మారుతుందని భావించిన అధికారులు.. దుర్గమ్మ మండపాన్ని తొలగించారు. ఈ ఘటన ఫై కాలనీ వాసులు , భక్తులు మండిపడుతున్నారు.
Read Also : Points Table: ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన భారత్..!