ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరు భక్తి భావంతో మెలగాలని ఛైర్మన్ కర్నాటి రాంబాబు కోరారు. రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు వేరే వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. దేవాలయంలో చేసిన ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే పాలక మండలికి తెలియజేసి, అమ్మవారి నవరాత్రి ఉత్సవాల విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. దేవస్థానంలో ఏర్పాట్లపై కొంతమంది చేస్తున్న విమర్శలకు ఛైర్మన్ సమాధానం ఇచ్చారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆలయ అలంకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయ ప్రాంగణాన్ని పూల అలంకరణతో శోభ తీసుకురావడం జరిగిందన్నారు.కొండచర్యలు విరిగిపడే అవకాశం వున్నప్రాంతాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ నిపుణులు పరిశీలించారని, వారి సూచనల మేరకు పూర్తి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు .సామాన్య భక్తులకు పెద్ద పీట వేసి సత్వరమే అమ్మవారి దర్శనం చేసుకునేలా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ ఏడాది చేసిన ఏర్పాట్లు భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తుంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో అవాస్తవాలు మాట్లాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు.దర్శనం కోసం వచ్చేవారు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఛైర్మన్ రాంబాబు విజ్ఞప్తి చేశారు. అధికారుల సూచనల మేరకు పూర్తి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
Also Read: Bandla Ganesh : రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఎవరూ మాట్లాడొద్దని బండ్ల గణేష్ రిక్వెస్ట్