Durantho Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్.. బొలెరో ధ్వంసం

ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ (Durantho Express) రైలు ఢీకొట్టింది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 09:53 AM IST

ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ (Durantho Express) రైలు ఢీకొట్టింది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రైలు నాలుగు గంటలు నిలిచిపోయింది. రైల్వే గేటును మూసినా బొలేరోను వేగంగా నడుపుతూ వచ్చిన కొందరు గేటును ఢీకొట్టి పట్టాలపైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్నవారంతా అక్కడి నుంచి పరారయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద దురంతో ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దురంతో ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా నాలుగు గంటలకుపైగా రైలు నిలిచిపోయింది. బొలెరో వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో బోలేరో తీవ్రంగా ధ్వంసం అయింది. రైలు ఇంజన్ కూడా దెబ్బతింది.

Also Read: Raghurama Krishnam Raju Astrology: ‘ముందస్తు’ సంకేతాలు బోలెడు!త్రిబుల్ ఆర్ జ్యోస్యం!

ప్రమాదం సమాచారం తెలియడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరో ఇంజన్ ను అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు వాహనంలో వచ్చింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. వారు దొంగలు అయి ఉండొచ్చని, పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.