AP DSC : ఏపీలో డీఎస్సీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష) మరియు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్‌పై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలికింది. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వారు చూపిన కారణాల్లో న్యాయపరమైన బలమేమీ కనిపించదని, వాటిలో సవాలుకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనితో సంబంధించి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలు సుప్రీంకోర్టు పరిధిలోకి రావోచ్చని కాకుండా, సంబంధిత హైకోర్టులో పరిగణించాల్సిన విషయాలని పేర్కొంది. ఎటువంటి సమస్యలు ఉన్నా, వాటిని రాష్ట్ర హైకోర్టులో ప్రస్తావించాలని అభిప్రాయపడింది.
Read Also: Jaggareddy : జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు -జహీరాబాద్ గడ్డపై సీఎం రేవంత్ ప్రకటన
ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెట్, డీఎస్సీ పరీక్షలు ఏ విధమైన మార్పుల్లేకుండా కొనసాగాలని స్పష్టమైన ఆదేశాలు వెలువడినట్లైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు పరీక్షల నిర్వహణ సంస్థలకు స్పష్టత లభించింది. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులలోనూ స్పష్టతతో పాటు ఉత్సాహం కూడా పెరిగింది. తాజా తీర్పుతో అభ్యర్థుల్లో చోటు చేసుకున్న సందిగ్ధతకు తెరపడింది. డీఎస్సీ షెడ్యూల్ ప్రకారం జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నాయి. టెట్ పరీక్షలు కూడా ఇదే కాలంలో జరిగే అవకాశముంది. అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా, హాల్‌టికెట్ల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పటినుంచి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్‌లో మార్పులుంటాయని భావించి సిద్ధత లోపించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కోర్టు తీర్పుతో ప్రభుత్వం మరియు విద్యాశాఖ మరింత నిశ్చయంగా ముందుకు సాగనుంది. ఇక,పై పరీక్షల నిర్వహణపై ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇది పలు సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది అభ్యర్థులకు శుభవార్తగా చెప్పవచ్చు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ఇది మరో ముందడుగు అవుతుందని భావిస్తున్నారు. కాగా, 16 వేల 347 టీచర్ ఉద్యోగాలకు ధరఖాస్తు ప్రక్రియ ముగిసింది. జూన్ 06వ తేదీ నుంచి జూలై 08వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని కొంతమంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Operation Sindoor : భద్రతా దళాల ధైర్యసాహసాలను కొనియాడిన రిలయన్స్ అధినేత