Site icon HashtagU Telugu

Mega DSC : అతి త్వరలో ఏపీలో DSC నోటిఫికేషన్ – మంత్రి సవిత

Dsc Savitha

Dsc Savitha

ఏపీలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో DSC నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేయబోతుంది ప్రభుత్వం. అలాగే వెనుకబడిన వర్గాల వారికి ఆన్లైన్లో ఉచిత DSC కోచింగ్ ఇస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించి, నిపుణులతో క్లాసులు నిర్వహించి, క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతామన్నారు.

బీఈడీ అర్హతతో పాటు టెట్లో అర్హత సాధించిన వారు ఉచిత ఆన్లైన్ కోచింగ్కు అర్హులని మంత్రి తెలిపారు. అంతే కాదు రెండు నెలల పాటు ఇవ్వనున్న ఈ ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ.1,500 స్టైపెండ్‌, మెటీరియల్ కోసం మరో రూ.1000 అందజేస్తామని తెలిపారు. నవంబర్‌ 16వ తేదీ నుంచి నుంచి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు.

ఇక 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని , ఒక్కో కోచింగ్ సెంటర్లో 200 మంది అభ్యర్థుల చొప్పున మొత్తం 5,200 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ బీసీ స్టడీ సర్కిళ్లలో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామని , వారితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామన్నారు.

ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ చూస్తే..

ఈ నోటిఫికేషన్ లో మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 పోస్టులు ఉన్నాయి. అయితే.. ఈ సంఖ్య నోటిఫికేషన్‌ విడుదల సమయానికి మారే అవకాశం ఉండొచ్చు.

Read Also : AP Govt ties: IIT మద్రాస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు