AP DSC : డీఎస్సీ-2025 పరీక్షల అభ్యర్థులకు కీలకమైన సమాచారం వెలువడింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డీఎస్సీకి సంబంధించిన ప్రాథమిక కీ(Initial Key), రెస్పాన్స్ షీట్లను (Response Sheets) ఈ రోజు (బుధవారం) అధికారికంగా విడుదల చేయనుంది.
ఈ కీ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా 16,437 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలపై అభ్యర్థులు తమ స్కోరు అంచనాలు వేసుకునే అవకాశం లభించనుంది. విడుదలయ్యే కీ, రెస్పాన్స్ షీట్లు ముఖ్యంగా TGT (నాన్ లాంగ్వేజ్), స్పెషల్ ఎడ్యుకేషన్, PGT, స్కూల్ అసిస్టెంట్ (గణితం) వంటి అన్ని మాధ్యమాల విభాగాలకు సంబంధించి ఉంటాయని అధికారులు తెలిపారు.
అభ్యర్థులు తమ వ్యక్తిగత హాల్‌టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి రెస్పాన్స్ షీట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, దానికి సంబంధించి ఆధారాలు జతచేసి, ఈ నెల 24వ తేదీలోపు https://apdsc.apcfss.in వెబ్‌సైట్ ద్వారా అభ్యంతరాలను సమర్పించాల్సిందిగా విద్యాశాఖ సూచించింది.
ఈ అభ్యంతరాల పరిశీలన తర్వాతే తుది కీ (Final Key)ను విడుదల చేయనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించబోతున్నట్టు సమాచారం. డీఎస్సీ పరీక్షలు రాష్ట్రంలో మే నెలలో పలు షెడ్యూల్‌ల్లో నిర్వహించబడ్డాయి. ఈ కీ విడుదలతో వేలాదిమంది అభ్యర్థుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఉద్యోగ ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు ఇది కీలకమైన దశగా మారనుంది.
ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా