Site icon HashtagU Telugu

Drugs : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. ప‌ట్టుబ‌డిన వారిలో ఏపీ అధికార పార్టీ చెందిన నాయకుడి కుమారుడు..?

Drugs

Drugs

హైద‌రాబాద్ ఎస్ఆర్ న‌గ‌ర్‌లో భారీగా డ్ర‌గ్స్‌ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఎస్సార్‌ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు సోదాలు నిర్వ‌హించారు. సోదాల్లో నార్కోటిక్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన యువకుల ఎస్ఆర్ న‌గ‌ర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్టీ కోసం డ్ర‌గ్స్‌ని గోవా నుంచి తెప్పించిన‌ట్లు స‌మాచారం. పట్టుబడిన వారిలో ఏపీ అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడు కుమారుడు ఉన్న‌ట్లు స‌మాచారం. పట్టుబడిన కార్లలో రాజకీయ నేతకు చెందిన కారు కూడా ఉంది. నెంబర్‌ ప్లేట్‌పై నుడా ఛైర్మన్‌ అని స్టిక్కరింగ్ ఉంది. పట్టుబడిన వారిలో నుడా ఛైర్మన్‌ ద్వారకానాద్‌ కుమారుడు ప్రేమ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రేమ్‌ బర్త్‌డే పార్టీ కోసం డ్రగ్స్‌ తీసుకొచ్చిన‌ట్లు నార్కోటిక్‌ బ్యూరో అధికారులు అనుమానిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు కలిసి డ్రగ్స్‌ పార్టీని ప్రేమ్ ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం.ఈ పార్టీలో దాదాపు 30 మంది పాల్గొన్నారన్న నార్కోటిక్‌ బ్యూరో అధికారులు తెలిపారు. గోవా నుంచి క్స్టెన్సీ పిల్స్ తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయిలో అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  MP Kesineni : బెజ‌వాడ ఎంపీ సీటుపై కేశినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కాల్‌మ‌ని, సెక్స్ రాకెట్‌లో ఉన్నవాళ్లకు.. ?