Site icon HashtagU Telugu

AP Liquor : మళ్లీ పాత బ్రాండ్స్ ను చూసి సంబరాలు చేసుకుంటున్న మందుబాబులు

Old Brands Ap

Old Brands Ap

ఏపీ(AP)లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..ఎన్నికల్లో చెప్పినట్లే రాష్ట్రంలో మళ్లీ పాత బ్రాండ్స్ (Liquor) ను అందుబాటులోకి తీసుకొచ్చి మందుబాబుల్లో ఆనందం నింపింది. రాష్ట్రంలో నేటినుండి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ మద్యం షాపులు లేకుండా… రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్‌ ఐడీలు కేటాయించింది.

రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. లైసెన్సులు దక్కించుకున్నవారు ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు పెట్టారు. దీంతో స్టాక్ వీలైనంత త్వరగా లిక్కర్ దుకాణాలకు చేరనుంది. 2019కి ముందు ఉన్న మద్యం బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి రావడం తో మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ లాంటి బ్రాండ్లను చూసి మందుబాబుల సంబరాలు అన్నీఇన్నీ కావు. మద్యం దుకాణాల్లో నగదుతో పాటు డిజిటల్ పేమెంట్లను స్వీకరిస్తున్నారు.

ఇక మద్యం (Liquor Price) ధరలు చూస్తే..

రాయల్ ఛాలెంజర్స్ విస్కీ క్వార్టర్ రూ.230, 8 PM విస్కీ క్వార్టర్ రూ.230, Mc Dowwels No1 విస్కీ క్వార్టర్ క్వార్టర్ రూ.180, ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ క్వార్టర్ రూ.150.. బ్రాండ్‌ను బట్టి విస్కీ క్వార్టర్ రూ.150 నుంచి రూ.230 మధ్య ఉంది.

బ్రాందీ విషయానికి వస్తే.. Mansion House క్వార్టర్ రూ.240, ఓల్డ్ మంక్ రమ్ము క్వార్టర్ రూ. 230, వోడ్కా మ్యాజిక్ మూమెంట్స్ క్వార్టర్ రూ.230. బీర్ల విషయానికి వస్తే.. కింగ్ ఫిషర్ Splendid స్ట్రాంగ్ బీర్ రూ. 200, కింగ్ ఫిషర్ స్ట్రోమ్ రీగల్ స్ట్రాంగ్ బీర్ రూ.220.. ఇలా మద్యం ధరలు ఉన్నాయి.

Read Also : Semiconductor : భారతదేశం సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్ల ఆదాయాన్ని అధిగమిస్తుందని అంచనా