TDP : వాళ్ళు చేసిన తప్పే మీరు చెయ్యకండి – నటుడు బ్రహ్మజీ ట్వీట్

AP సురక్షితమైన చేతుల్లో ఉంది.మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి.. ట్రోలింగ్ మన ఉద్దేశ్యం కాదు.. మంచి భవిష్యత్తు కోసం, మన కోసం మనం పని చేద్దాం.. వాళ్ళు తప్పు చేస్తే మళ్లీ మీరు అదే తప్పు చేయకండి

  • Written By:
  • Publish Date - June 6, 2024 / 05:14 PM IST

ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. కూటమి అధికారంలోకి రావడం తో పలు చోట్ల ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. కూటమి అధికారంలోకి రావడం తో పలు చోట్ల టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. గతంలో తమపై దాడి చేసి, ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. నిన్నటి నుండి అనేక చోట్లా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఈ దాడులపై నటుడు బ్రహ్మజీ సోషల్ మీడియా వేదికగా చిన్న విన్నపాన్ని తెలియజేసారు. ” పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. మళ్లీ పనిలోకి దిగండి. ఉత్సాహం మరియు వినోదం ముగిసింది.. AP సురక్షితమైన చేతుల్లో ఉంది.మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి.. ట్రోలింగ్ మన ఉద్దేశ్యం కాదు.. మంచి భవిష్యత్తు కోసం, మన కోసం మనం పని చేద్దాం.. వాళ్ళు తప్పు చేస్తే మళ్లీ మీరు అదే తప్పు చేయకండి” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క జగన్ సైతం ఈ దాడులపై గవర్నర్ కు సూచించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ కి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్‌.. వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’’. అంటూ జగన్‌ ట్వీట్ చేసారు. అయితే
కొంతమంది టీడీపీ మాత్రం తాము చేస్తుంది తప్పు కాదని..గతంలో ఇంతకంటే ఎక్కువగా వారు చేసారని..ఐదేళ్లు ప్రాణాలను చేతిలో పెట్టుకొని బ్రతికామని చెపుతున్నారు.

Read Also : Akira Nandan : ఎన్టీఆర్, బన్నీ పై పవన్ కొడుకు అకిరా వీడియో ఎడిట్స్ చూసారా..?