ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి’ (Free Bus Scheme) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మహిళలు బస్సు ప్రయాణంలో ఓపికతో ఉండాలని, డ్రైవర్లు, కండక్టర్లను గౌరవించాలని సూచించారు. అప్పుడే ప్రయాణం సులభంగా ఉంటుందని అన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పందించారు. ఇది అందరి మంచి కోరే ప్రభుత్వం అని, ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సూచనల మేరకు వారికి కూడా న్యాయం చేస్తామని తెలిపారు. ఈ పథకం వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
CM Revanth: మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎలా వదులుకుంటాం?: సీఎం రేవంత్
తమ ‘సూపర్ సిక్స్’ హామీలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఏ ప్రాంతం నుంచి అయినా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా ఉచితంగా దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కండక్టర్లుగా తొలిసారిగా మహిళలను నియమించింది తామేనని గుర్తుచేస్తూ, త్వరలో వారికి డ్రైవర్లుగా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. మొత్తం 11,449 బస్సుల్లో 8,450 బస్సులను ఈ పథకానికి కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం మహిళల ఆర్థికాభివృద్ధికి, స్వయం సమృద్ధికి తోడ్పడుతుందని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి, పోలవరం ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ గతంలో విమర్శలు ఎదుర్కొన్న అమరావతిని గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తామని, పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.