Site icon HashtagU Telugu

Donations : ‘అన్నా క్యాంటీన్ల’‌‌కు సామాన్యుల విరాళం.. టీడీపీ సర్కారుకు ప్రజా చేయూత

Donations For Ap

Donations : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ తమవంతుగా చేయూత అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తద్వారా సామాజిక బాధ్యతను నిర్వర్తించే విషయంలో తమకు ఉన్న నిబద్ధతను వారంతా చాటిచెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

కనెక్ట్ టు ఆంధ్రా కార్యక్రమానికి దేవీ సీఫుడ్స్ సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ డొనేషన్‌ను ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోట్రు బ్రహ్మానందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. వైఎస్ జగన్‌ సీఎంగా ఉన్న టైంలోనూ పోట్రు బ్రహ్మానందం స్వయంగా వెళ్లి కలిసి దాదాపు  రూ.2 కోట్ల విరాళాన్ని అందించారు.  ప్రభుత్వాలు మారినా సామాజిక బాధ్యతగా దేవీ సీఫుడ్స్ సంస్థ ఏపీ డెవలప్మెంట్ కోసం పెద్దమొత్తంలో విరాళాలను(Donations) అందిస్తుండటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని సంస్థలు ఇదేవిధంగా ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది.

Also Read : YSRCP Office Demolition : తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ఆఫీసు నిర్మాణం కూల్చివేత

పేదలకు అన్నం పెట్టేందుకు ఉద్దేశించిన అన్నా క్యాంటీన్లను గత వైఎస్సార్ సీపీ సర్కారు బంద్ చేయించింది. ఇప్పుడు చంద్రబాబు వాటిని మళ్లీ తెరిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాల్లో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునరుద్ధిరించడానికి సంబంధించినది. తక్కువ ఖర్చుకే పేదవాడికి అన్నం పెట్టడం అన్నా క్యాంటీన్ల లక్ష్యం. అవి మళ్లీ తెరుచుకోనున్న తరుణంలో గుంటూరు యువతి మర్రిపూడి సుష్మ సేవాభావాన్ని చాటుకున్నారు. ఆమె సీఎం చంద్రబాబును కలిసి అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం రూ.లక్ష విరాళాన్ని అందించారు. గుంటూరు పట్టణంలోని వికాస్ నగర్ చెందిన సుష్మ అమెరికాలోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. పెద్ద మనసుతో అన్నా క్యాంటీన్ నిర్వహణకు చెక్కు అందించిన సుష్మతో పాటు ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ, మంజువాణిని సీఎం చంద్రబాబు ఈసందర్భంగా అభినందించారు.

Also Read : Space Debris Hit Home : ఇంటిపై పడిన అంతరిక్ష శిథిలం.. భారీ పరిహారం కోసం నాసాపై కేసు