Dokka : టీడీపీ గూటికి డొక్కా మాణిక్యవరప్రసాద్?

Dokka Manikya Vara Prasad: గత కొంతకాలంగా వైసీపీ(ycp)తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్(Dokka Manikya Vara Prasad) టీడీపీ(tdp)లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu)  గుంటూరులోని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఇంటికి వచ్చి చర్చించారు. పల్నాడు జిల్లాలోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, ప్రచారంలో పాల్గొనాలని కోరారు. పార్టీలో ప్రాధాన్యత ఉండేలా చూస్తామని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం నుంచి […]

Published By: HashtagU Telugu Desk
Dokka Manikya Vara Prasad J

Dokka Manikya Vara Prasad joins TDP?

Dokka Manikya Vara Prasad: గత కొంతకాలంగా వైసీపీ(ycp)తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్(Dokka Manikya Vara Prasad) టీడీపీ(tdp)లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu)  గుంటూరులోని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఇంటికి వచ్చి చర్చించారు. పల్నాడు జిల్లాలోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, ప్రచారంలో పాల్గొనాలని కోరారు. పార్టీలో ప్రాధాన్యత ఉండేలా చూస్తామని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డొక్కా ప్రస్తుతం క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గుంటూరు జిల్లాలో వైకాపా అభ్యర్థుల ప్రచారంలోనూ ఆయన పాల్గొనడం లేదు. జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా లేరు. తనకు రాజకీయంగా ప్రాధాన్యత లేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన డొక్కాకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ పార్టీలో తనకు ప్రాధాన్యం కరవైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. తనను సంప్రదించకుండానే తాడికొండ ఇన్‌చార్జిగా నియమించడం డొక్కాను తీవ్రంగా నిరాశపరిచింది. తరువాత తనను ఆ బాధ్యతల నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Read Also: Puthalapattu MLA MS Babu : కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే

  Last Updated: 06 Apr 2024, 02:21 PM IST