Site icon HashtagU Telugu

AP Politics: ఏపీలో కుక్క, కోడి రాజకీయం…

AP Politics

New Web Story Copy 2023 07 17t130236.904

AP Politics: రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులూ ఉండరు. అయితే ఇది ఓ పదేళ్ల నాటి సామెత. ప్రస్తుతం రాజకీయాలు ఎలా తయ్యారయ్యాయంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య బద్దశత్రుత్వం ఉండాలనేలా వ్యవహరిస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. తెలంగాణ పరిస్థితి అటుంచితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఏ మాత్రం హెల్దీ పాలిటిక్స్ కనిపించడం లేదు. తిట్టుకోవడం, కాదంటే కొట్టుకోవడం ఇదే తంతు అక్కడ ఏర్పడింది. తాజాగా ఏపీలో జరిగిన ఘటన చూస్తే నవ్వాలో, ఆశ్చర్యపడాలో అర్ధం కానీ పరిస్థితి. ఒక కోడిని కుక్క కరిచిన పాపానికి రెండు పార్టీల మధ్య ఫైట్ జరిగింది.

Also Read: Poonam Kaur: మహిళలపై అభిమానం చూపిస్తున్న ఫేక్ లీడర్లు

వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామ స్థానిక టీడీపీ నేత చలపాటి చంద్రకు చెందిన కోడిని వైసీపీ నేత నారాయణరెడ్డి పెట్ డాగ్ కరిచింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అదికాస్తా కొట్టుకునే వరకు దారి తీసింది. ఈ దాడిలో టీడీపీ లీడర్ చంద్రకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను కడపలోని సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పోలీసులు కలగజేసుకొని ఇరువర్గాలపై కేసును నమోదు చేశారని ఎస్సై తులసి నాగప్రసాద్ తెలిపారు.

Also Read: Ileana Reveals: అతడే నా రసహ్య ప్రియుడు, ఇలియానా ఇన్ స్టా పోస్ట్ వైరల్