Srisailam : డాక్టర్స్ నిర్లక్ష్యం భక్తుడు మృతి..

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 02:58 PM IST

శ్రీశైలం (Srisailam ) లో డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా ఓ భక్తుడు మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు. అనారోగ్యంతో ఉన్న భక్తుడిని వైద్యశాలలో ఎందుకు చేర్చుకోరు అంటూ 108 సిబ్బంది వైద్యశాల సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. వాగ్వివాదంతో గంటపాటు కాలయాపన చేయడంతో మల్లన్న భక్తుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్ కు చెందిన సిద్దంశెట్టి సురేష్ ప్రసాద్ (35) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి శ్రీశైల స్వామి దర్శనం కోసం వెళ్లారు. స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతరం సాక్షి గణపతి ఆలయ దర్శనానికి వెళ్లాడు. ఆలయం వద్ద అనారోగ్యంతో ప్రసాద్ పడిపోయాడు. వైద్యం కోసం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ఈ సమయంలో 108 సిబ్బంది , వైద్యశాల సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. గొడవ కారణంగా సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతో సురేష్ ప్రసాద్ మృతి చెందాడు. మృతిని భార్య ఆర్తనాదాలు అక్కడి భక్తులను కలిచివేసింది. డాక్టర్ల నిర్లక్ష్యం ఫై యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Financial Problem Tips : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా..? అయితే ఇలా చేస్తే చాలు.. అదృష్టం పట్టి పీడీంచడం ఖాయం..