Site icon HashtagU Telugu

Barrelakka : లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క కు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?

Barrelekka

Barrelekka

బర్రెలక్క (Barrelakka ) ..సోషల్ మీడియా లో ఈ పేరు బాగా ఫేమస్. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె పేరు మారుమోగిపోయింది. డిగ్రీ చేసిన బర్రెలక్క ఉద్యోగం రాకపోవడంతో బర్రెలను కాసుకుంటున్నానని మొదట ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత వరుస వీడియోస్ చేస్తూ పేరు తెచ్చుకున్న ఈమె..ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి ఇండిపెండెంట్ కాండిడేట్గా నిల్చుని వార్తల్లో నిలిచింది. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత..కొద్దీ రోజులకు పెళ్లి చేసుకొంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రీసెంట్ గా తెలంగాణ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి స్థానానికి నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కనీస పోటీ ఇవ్వకుండానే ఓడిపోయింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా 5754 ఓట్లు సాధించిన బర్రెలక్క.. ఎంపీ అభ్యర్థిగా మాత్రం కేవలం 3087 ఓట్లు మాత్రమే సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో ఆమెకు కేవలం 0.25 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో ఆమె 12వ స్థానంలో నిలిచింది.

ఇక తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను కాంగ్రెస్, బిజెపి చెరో 8 స్థానాలు దక్కించుకోగా హైదరాబాద్ లో మరోసారి AMIM విజయ డంఖా మోగించింది. ఇక బిఆర్ఎస్ మాత్రం ఒక్క స్తానం కూడా గెలుచుకోలేకపోయింది.

Read Also : Apollo Hospitals Chairman : ప్రమాదానికి గురైన ఉపాసన తాత