Site icon HashtagU Telugu

Man’s Search for Meaning : పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ఈ బుక్ గురించి తెలుసా..?

Man's Search For Meaning Bo

Man's Search For Meaning Bo

 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan) “మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్” (Man’s Search for Meaning) అనే పుస్తకాన్ని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసిన సంగతి సోషల్ మీడియా లో చర్చనీయాంశమైంది. ఈ పుస్తకం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని, అనేకమంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. విక్టర్ ఫ్రాంక్ (Victor Frank) అనే ప్రముఖ మానసిక వైద్యుడు రాసిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.

Scarlet Fever : హైదరాబాద్ లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు

విక్టర్ ఫ్రాంక్ ఎవరు..?

విక్టర్ ఫ్రాంక్ ఒక హోలోకాస్ట్ నివాసి మరియు మానసిక వైద్య నిపుణుడు. ఆయన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల శిబిరాలలో అనుభవించిన బాధలు, అవమానాలు, మరియు మరణ భయాలను తన రచనలో ప్రతిబింబించారు. శరణార్థి శిబిరాల్లో ఎదుర్కొన్న అనుభవాలు ఆయనకు జీవితంపై నూతన దృష్టిని అందించాయి. “మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్” పుస్తకం ఆయనే స్వీయ అనుభవాలను మరియు జీవితానికి సంబంధించిన విలువైన పాఠాలను వివరించింది.

“మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్” పుస్తకంలోని ముఖ్యాంశాలు :

ఈ పుస్తకంలో ఫ్రాంక్ ఒక వ్యక్తి కష్టాల్లోనూ, నిస్సహాయతలోనూ తనకు జీవితం ఎంత విలువైనదో గుర్తించడం, జీవితానికి ఒక అర్థాన్ని కనిపెట్టడం ఎలా అనేది వివరించారు. అనేక కష్టాలను, జీవితంలోని బాధలను ఎదుర్కొన్నా, మనిషి జీవితాన్ని ప్రేరణతో, ఆశతో ఎలా మార్చుకోవచ్చో ఈ పుస్తకంలో వివరించబడింది.

పవన్ కళ్యాణ్ ఈ పుస్తకాన్ని తన సన్నిహితులకు పంపించేందుకు కొనుగోలు చేశారని సమాచారం. “మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్” పుస్తకంలోని ఆలోచనలతో స్ఫూర్తిని పొందాలని, జీవితంలోని కష్టాలను అధిగమించేందుకు ఇది ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. పవన్ ఈ పుస్తకం కొంగలు చేయడంతో సోషల్ మీడియా లో ఈ పుస్తకం పై విస్తృత చర్చ జరుగుతోంది. చాలా మంది “మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్” వారి జీవితంలో స్ఫూర్తిదాయక మార్పులకు కారణమైంది అని పంచుకున్నారు. ఈ పుస్తకం చదవడం ద్వారా మనసుకు ఓదార్పు కలగడం, జీవితానికి సానుకూల దృక్కోణం రావడం వంటి ప్రయోజనాలను ఎన్నో మంది అభినందిస్తున్నారు.