Site icon HashtagU Telugu

AP CM Salary : ఏపీ సీఎం, తెలంగాణ సీఎం వేతనాలు ఎంతో తెలుసా ?

CM Chandrababu

CM Chandrababu

AP CM Salary : నారా చంద్రబాబునాయుడు రాజకీయాల్లో అపర చాణక్యుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి సీఎం అయ్యారు. సీఎం హోదా చాలా కీలకమైంది అనే విషయం అందరికీ తెలుసు. ఆ పదవిలో ఉండేవారే రాష్ట్ర భవితకు మార్గదర్శకత్వం చేస్తారనే విషయం కూడా అందరికీ తెలుసు. కానీ చాలామందికి సీఎం హోదాలో ఉండేవారి గౌరవ వేతనాల(AP CM Salary) వివరాల గురించి తెలియదు. ఇప్పుడు ఆ ఆసక్తికర సమాచారాన్ని తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి మన దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రీతిలో ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిని బట్టి సీఎం పదవిలో ఉండే వారికి గౌరవ వేతనం, అదనపు భత్యాలు అందుతుంటాయి. గౌరవ వేతనాన్ని నిర్ణయించుకునే అధికారం సీఎంకు ఉంటుంది. అందువల్లే సీఎంగా తాను ప్రతినెలా  రూ.3,35,000 వేతనాన్ని తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక అదనంగా చాలా సౌకర్యాలు ఆయనకు ప్రభుత్వం తరఫున లభిస్తుంటాయి.అదనపు భత్యాలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.  చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వమే చూస్తుంది. విదేశీ పర్యటనల ఏర్పాట్లను ప్రభుత్వమే చేస్తుంది. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వానివే. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా విమానాలు, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. వాటిని సీఎంలు, గవర్నర్ ఎప్పుడైనా వాడుకోవచ్చు. పాలనా వ్యవహారాలలో సమయం ఆదా కోసం వాటిని వాడుతుంటారు. రాష్ట్రంలో అంతర్గతంగా పర్యటించేందుకు హెలికాప్టర్‌ను,  రాష్ట్రం బయటకు వెళ్లడానికి విమానాన్ని వాడతారు.

Also Read : Unlock EVM : ఫోన్‌తో ఈవీఎం అన్‌లాక్ చేసిన ఎంపీ బావమరిది.. కేసు నమోదు

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేశంలోనే అత్యధికంగా ప్రతినెలా రూ.4.10 లక్షల వేతనం అందుతోందని తెలుస్తోంది. ఇక ఇటీవల ప్రమాణం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ ప్రతినెలా రూ.1.60 లక్షల వేతనాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి నెలవారీ వేతనం ప్రస్తుతం రూ.1.05 లక్షలే ఉంది.

సీఎంల నెలవారీ వేతనాలు ఇలా.. 

ఢిల్లీ సీఎం నెలవారీ వేతనం రూ. 3,90,000, ఉత్తరప్రదేశ్ సీఎం వేతనం రూ. 3,65,000, మహారాష్ట్ర  సీఎం వేతనం రూ. 3,40,000, గుజరాత్ సీఎం వేతనం  రూ. 3,21,000, హిమాచల్ ప్రదేశ్ సీఎం వేతనం రూ. 3,10,000 ఉన్నాయి.  హరియాణా సీఎం వేతనం రూ. 2,88,000,  జార్ఖండ్ సీఎం వేతనం రూ. 2,55,000, పశ్చిమ బెంగాల్ సీఎం వేతనం రూ. 2,10,000 ఉన్నాయి. మధ్యప్రదేశ్ సీఎం వేతనం రూ. 2,30,000, ఛత్తీస్‌గడ్ సీఎం వేతనం రూ. 2,30,000, పంజాబ్ సీఎం వేతనం రూ. 2,30,000, గోవా సీఎం వేతనం రూ. 2,20,000, బీహార్ సీఎం వేతనం రూ. 2,15,000 ఉన్నాయి.

Also Read :Rahul Gandhi : ఈవీఎంలు బ్లాక్‌బాక్స్‌లుగా మారాయ్.. తనిఖీ చేయనివ్వరా ?:రాహుల్‌గాంధీ