అభిమానుల మరణాలు హీరోలను డ్యామేజ్ చేస్తున్నాయి. అనుకోకుండా జరిగిన ఘటనలకు రాజకీయ రంగు పూసి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. మొన్నటి వరకు సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Incident) వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగితే, ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఈవెంట్ (Game Changer Pre Release)వ్యవహారం రచ్చ మొదలైంది. ముఖ్యంగా వైసీపీ నేతలు కావాలనే దీనిపై ఎక్కువ చేస్తున్నారు.
రామ్ చరణ్ – శంకర్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ ఈ నెల 10 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల అవుతుంది. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా శనివారం రాజమండ్రి లో ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరుకావడం తో సినిమాకు మరింత బజ్ వచ్చింది. అయితే ప్రీ రిలీజ్ అనంతరం అభిమానులు తిరుగు ప్రయాణంలో ఓ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదానికి (2 Fans Dies) గురై చనిపోయారు. ఈ ఘటన పై చిత్ర యూనిట్ తో పాటు హీరో రామ్ చరణ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి మరణించిన వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేశారు. అయితే దీనిపై వైసీపీ నేతలు రచ్చ చేయడం మొదలుపెట్టారు. వరుస పెట్టి నేతలు ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ను లాగుతూ వివాదంలో పడేస్తున్నారు.
తాజాగా దీనిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి రోజా (Roja) స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. ‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్? ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు మెగా అభిమానులు కూడా అదే రీతిలో కామెంట్స్ వేస్తున్నారు. మానవత్వం గురించి రోజా మాట్లాడుతుందే అంటూ గతంలో రోజా చేసిన వ్యవహారాలు బయట పెడుతూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటారు.
కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా @PawanKalyan? ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!!#SaveAPYouth pic.twitter.com/PboRQmUQXc
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 7, 2025