CBI Court: బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (jagan) సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదానలు జరిగాయి. సీబీఐ తన వాదనలు వినిపిస్తూ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది. యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి తనకు అవకాశం ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టుకు మనవి చేశారు. సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణ వాయిదా వేశారు. బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని, ఆయన పైన నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ ఇంకా పెండింగ్ లో ఉందని, కేసు విచారణ చాలా ఆలస్యం అవుతుందని సీబీఐ కోర్టుకు చెప్పింది. మాజీ సీఎం జగన్ విదేశాలు వెళ్లడానికి అవకాశం ఇవ్వకూడదని సీబీఐ కోర్టుకు మనవి చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
వాదనలు విన్న సీబీఐ కోర్టు ఈనెల 27వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతుందని గతంలో సీఎం హోదాలో ఉన్న జగన్ కేసు విచారణకు హాజరు కాలేదని ఇప్పుడు ఆయన మరోసారి విదేశీ పర్యటనలో ఉంటే కేసు విచారణ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సీబీఐకి చెందిన ఓ అధికారి అంటున్నారని తెలిసింది. ఇదే కేసులో నెంబర్ టూగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లడానికి ప్రత్యేక కోర్టు అనుమతి కోరారు.
మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తరఫున ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. యూరప్ లో వచ్చే నెల 6వ తేదీ తేదీ నుండి రెండు నెలల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు మనవి చేశారు. గతంలో కూడా విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు కూడా అనుమతి ఇవ్వాలని ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు మనవి చేశారు.
అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తే కోర్టు విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే కేసు విచారణ ఆలస్యం అయ్యిందని సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని సీబీఐ అధికారులు కోర్టుకి మనవి చేశారు. వాదనలు విన్న కోర్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విదేశీ పర్యటన పై దాఖలు అయిన పిటిషన్ విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.