Mega DSC : DSC అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా

DSC : కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు కానీ వాయిదాకు కారణాలు మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది.

Published By: HashtagU Telugu Desk
Ap Dsc

Ap Dsc

ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న DSC అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ (Distribution of DSC appointment letters) కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. అమరావతిలో రేపు నిర్వహించాల్సిన ఈ నియామకపత్రాల పంపిణీని తాత్కాలికంగా రద్దు చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు కానీ వాయిదాకు కారణాలు మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది.

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ కేసు నమోదు

అమరావతికి రానున్న అభ్యర్థుల కోసం జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమం వాయిదా పడడంతో ఆ బస్సులను కూడా రద్దు చేశారు. ఇప్పటికే అమరావతికి చేరుకోవడానికి సిద్ధమైన అభ్యర్థులు ఈ పరిణామంతో గందరగోళానికి గురయ్యారు. ప్రభుత్వ నియామకాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న యువతకు మరోసారి నిరుత్సాహం తప్పలేదు.

అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలే ఈ కార్యక్రమం వాయిదా పడటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. భద్రతా సమస్యలు, రవాణా అంతరాయాలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటనలో దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని DSC అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  Last Updated: 18 Sep 2025, 11:30 AM IST