Trains Cancelled : ఆగస్టు 5 నుంచి 10 వరకు విశాఖపట్నం – కడప (17488) తిరుమల ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 6 నుంచి 11 వరకు కడప-విశాఖపట్నం (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో మూడో లైన్ పనులు జరుగుతున్నాయి. ఇంటర్ లాకింగ్ పనులు కూడా నడుస్తున్నాయి. వీటి కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలోని కొన్ని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. విజయవాడ, గూడూరు సెక్షన్‌లో పలు రైళ్లను(Trains Cancelled) రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
పూర్తిగా రద్దయిన, దారిమళ్లించిన రైళ్లు ఇవే
ఈనెల 15 నుంచి 30 వరకు పూర్తిగా రద్దయిన రైళ్ల జాబితాలో విజయవాడ- గూడూరు (07500), విజయవాడ- గూడూరు (12743/12744) రైళ్లు ఉన్నాయి. ఈనెల 16 నుంచి 30 వరకు పూర్తిగా రద్దయిన రైళ్ల(Vijayawada Division) జాబితాలో విజయవాడ- ఒంగోలు (07461), ఒంగోలు- విజయవాడ (07576) రైళ్లు ఉన్నాయి. ఈనెల 16, 23, 24, 30 తేదీల్లో గూడూరు- విజయవాడ (17259/17260) రైలు పూర్తిగా రద్దయింది. ఈనెల 16 నుంచి 31 వరకు గూడూరు- విజయవాడ (07458) రైలు పూర్తిగా రద్దయింది. కొన్ని రైళ్లను రేణిగుంట, ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు మీదుగా దారి మళ్లించారు. ఈనెల 15,22,29 తేదీల్లో ఎర్నాకుళం- హౌరా (22878), 22న హౌరా- బెంగళూరు (22863), 22, 29 తేదీల్లో సంత్రాగచి- తాంబరం (22841 ), 23,30 తేదీల్లో మధురై- నిజాముద్ధీన్ (12651) రైళ్లను దారి మళ్లించారు.
Also Read :Electricity Bill Payment : TGSPDCL, TGNPDCL యాప్స్, వెబ్‌సైట్స్‌లో కరెంటు బిల్లు కట్టడం ఇలా..
వేళలు మారిన రైళ్ల వివరాలివీ..
హౌరా- కన్యాకుమారి(12665) రైలు ఈనెల 15న 180 నిమిషాలు, 22న 120 నిమిషాలు, 29న 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. ఆదిలాబాద్- తిరుపతి (17406) రైలు ఈనెల 15న 60 నిమిషాలు, 22న 150 నిమిషాలు, 29న 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. తిరునర్వేలి- కత్రా (16787) రైలు ఈనెల 15, 29 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. నిజాముద్దీన్- చెన్నైసెంట్రల్ (12612) రైలు ఈనెల 16న 100 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. బెంగళూరు- హతియా(18638) రైలు ఈనెల 16న 210 నిమిషాలు, 30న 150 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. చెన్నైసెంట్రల్- గయ(12390) రైలు ఈనెల 16, 30 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది.