అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలోని అసంతృప్తులు ఒక్కొక్కరిగా తమ స్వరాన్ని మారుస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తుండటం.. కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా సొంతపార్టీ నేతలపై తిరుగుబాటు చేస్తుండటంతో ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గంలో వర్గవిభేదాలు బట్టబయలైయ్యాయి. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కలహాలు ఓ సర్వే సంస్థ కాల్ తో బహిర్గతమైయ్యాయి. తాడేపల్లి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, నియోజవర్గానికి చెందిన ఓ సీనియర్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. సదరు వైసీపీ మహిళ నేత నేరుగా సోషల్ మీడియా లో స్వయంగా కాల్ రికార్డు పోస్ట్ చేయటంతో ఈ విషయం బయటకు వచ్చింది. వైసీపీ పట్టణ గౌరవ అధ్యక్షుడు, పలువురు కౌన్సిలర్లు “కేఢిలు, కేటుగాళ్లు” అంటూ వ్యాఖ్యలు చేయడం సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. పలువురు తాజా మాజీ ప్రజాప్రతినిధులను ఏక వచనంతో పాటు పరుషపదజాలం వాడటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై అనుచిత వ్యాఖ్యాలు చేయటంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సైతం వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
YSRCP : తాడేపల్లి వైసీపీలో వర్గపోరు.. సర్వే సంస్థ ఫోన్ కాల్‌తో బయటపడ్డ..!

Ysrcp