Site icon HashtagU Telugu

TDP- Janasena List : టీడీపీ-జనసేనలో మొదలైన అసంతృప్తి జ్వాలలు

Discontent Flares In Tdp Ja

Discontent Flares In Tdp Ja

టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా ఈరోజు శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో , మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేన కేవలం 5 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించగా..మిగతా అభ్యర్థులను రెండో లిస్ట్ లో ప్రకటించబోతున్నది. ఈ మొదటి లిస్ట్ (TDP- Janasena List) లో పవన్ కళ్యాణ్ పేరు కానీ నాగబాబు పేరు కానీ లేదు. ఇదిలా ఉంటె..ఈ లిస్ట్ ఫై రెండు పార్టీలలో అసంతృప్తి జ్వాలలు మొదలయాయ్యి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల తాలూకా అభిమానులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల దిష్టి బొమ్మలను తగలబెట్టడం, వారిని వ్యతిరేకంగా నినాదాలు చేయడం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజానగరంలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి ఎదురైంది. టీడీపీ సీనియర్‌ బుచ్చయ్య చౌదరి కి టికెట్ ఇస్తారా లేదా అనేది తెలియడం లేదు. ఇక.. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు సీట్లు టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. తణుకులో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని స్వయంగా ప్రకటించిన పవన్‌.. ఇప్పుడు చంద్రబాబుకి తలొగ్గి ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేశాడని కేడర్‌ మండిపడుతోంది. ఇలా అనేక చోట్ల ఇరు పార్టీల కార్యకర్తలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మరి టికెట్ రాని నేతలకు పార్టీ ప్రత్యేక భాద్యత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారు మాత్రం శాంతించడం లేదు. మరి వీరంతా పార్టీ విజయానికి సపోర్ట్ చేస్తారా..? లేదంటే పార్టీ మారతారా అనేది చూడాలి.

Read Also : Partha Saradhi : పార్టీలో చేరకపోయినా టీడీపీ టికెట్ దక్కించుకున్న పార్థసారథి